మహబూబ్‌నగర్

పాలమూరు ఎత్తిపోతల అడ్డుకుంటే పుట్టగతులుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ టౌన్, మే 3: మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల చిరకాల వాంచ అయిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని టిడిపి, వై ఎస్ ఆర్ సిపి నాయకులు అడ్డుకుంటే వారికి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంతో ప్రతిపక్ష పార్టీలకు తమ ఉనికి ఎక్కడ కొల్పోతామనే భయం పట్టుకుందని అందువల్లే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎలాగైన అడ్డుకుని తమ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారని ఆయన విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారానే జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఎవరేన్ని దిక్షలు చేసిన, ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగిపోదని ఆయన దీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆమలు చేస్తున్న పథకాల్లో పాలమూరు ఎత్తిపోతల పథకం అతిముఖ్యమైందని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమైన టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏ మాత్రం ఢీకొనలేవని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయం నిరూపించబడిందని అయిన పాలమూరు ఎత్తిపోతల పథకంపై రాదంతం చేయడం శోచనీయమని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి పార్టీలు కనుమరుగు అవడం ఖాయమని ఆయన పెర్కోన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైన ఆ పార్టీల అధిష్టానాల మనోగతాలను అర్థం చేసుకుని ఆ పార్టీలను వీడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అబివృద్దే ద్యేయంగా ముందుకు సాగుతున్న టిఆర్‌ఎస్ పార్టీలోకి చేరి రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించి చరితార్థులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు వెంకటయ్య, బెక్కం జనార్థన్, సురేందర్‌రెడ్డి, కోట్ల కిషోర్, పిల్లి సురేష్ పాల్గొన్నారు.