మహబూబ్‌నగర్

తెలంగాణ దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, జూలై 21: భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టులోని మొదటి లిప్టు మోటార్లను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం జలకళ వచ్చిందని, సీఎం కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత మూడోసారి ఎంజీకేఎల్‌ఐ నుంచి నీటిని పంపింగ్ చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, నెట్టంపాటు, భీమా, ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టుల ద్వారా 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరున్నర లక్షల ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందుతుందని, మిగతా లక్షాన్నర ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులను సత్వరంగా పూర్తి చేయిస్తామని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణానది ప్రతినీటి చుక్కను వడిసి పట్టుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. నికర జలాలు వాటాలో 811 టీఎంసీల నీళ్లు ఉండగా తెలంగాణకు 390 టీఎంసీల వాటా ఉందని, అందులో వంద టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. వివిధ కారణాలతో రిజర్వాయర్లు లేక పూర్తిస్థాయిలో నీటిని వాడుకోలేకపోయామని అన్నారు. తొలకరిలోనే కృష్ణానది నీటిని తోడుకొని చెరువులు, కుంటలు నింపుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణమవుతుంటే అటు ఆంధ్ర పాలకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు కేసులు పెడుతూ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 60ఏళ్ల సమైక్య రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే జరుగుతున్నదన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ జైర్మన్ బండారి భాస్కర్‌లతోపాటు ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జడ్పీటీసీ హన్మంతునాయక్, నాయకులు నర్సింహారావు, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాగు విస్తీర్ణాన్ని పెంచుతాం

* రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
కొత్తకోట, జూలై 21: జూరాలకు వరద ఉదృతి కొనసాగుతుండడంతో వస్తున్న ప్రతి నీటి బొట్టును రిజర్వాయర్లకు తరలించి సాగు విస్తీర్ణనాన్ని పెంచుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కానాయపల్లి రిజర్వాయర్ వద్ద నిర్మించిన రింగుబండ్‌ను పరిశీలించారు. జూరాలకు వస్తున్న నీటిని బీమా పెస్-2 ద్వారా కానాయపల్లి రిజర్వాయర్ నింపి దిగువకు నీటిని వదులుతున్నామన్నారు. సుమారుగా రెండున్నర లక్షల ఎకరాల సాగులోకి వస్తుందని ఆయన తెలిపారు. గతంలో ఈ ప్రాంతంపై ఏ ముఖ్యమంత్రి శ్రద్ద వహించలేదని, ముఖ్యమంత్రి కేసి ఆర్ కృష్ణాకు నీరు వచ్చిన వెంటనే మొదటగా పాలమూరు జిల్లాకే హక్కు ఉందని సగంకు పైగా పంట పొలాలు పచ్చదనం అయ్యయన్నారు. గత ముఖ్యమంత్రులు జూరాలకు నీరు ఎప్పుడు వచ్చిన శ్రీశైలానికి తరలించుకుపోయ్యే వారని, కేసిఆర్ ముఖ్యమంత్రి కావడమే తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. గత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతంపై శ్రద్ద వహించలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ నేతలు కురుమూర్తియాదవ్, ప్రశాంత్, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో మెరిసిన కొట్ర తేజం
* సూపర్ పీజీలో అలిండియా 121 ర్యాంక్ * న్యూర్ సర్జన్ చేయడమే లక్ష్యమన్న డా:నాగార్జున
* అభినందించిన కల్వకుర్తి డివిజన్ స్వేరోస్
కల్వకుర్తి, జూలై 21: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన డా: నాగార్జున జాతీయ స్థాయిలో మెరిసిన కొట్ర తేజమని, సూపర్ పిజి అలిండియా 121 ర్యాంక్ సాధించడం కల్వకుర్తి నియోజకవర్గానికే గర్వకారణమని కల్వకుర్తి డిబిజన్ స్వేరోస్ అధ్యక్షులు నాగేష్ అన్నారు. శనివారం స్వేరోస్ డివిజన్ కమిటీ అధ్యక్షులు నాగేష్ విలేకరులతో మాట్లాడుతూ కృషి, పట్టుదల , నిరంతర శ్రమించే తత్వం ఉంటే ఎతంటి విజయాన్ని అయిన సొంతం చేసుకోవచ్చని డా: నాగార్జున నిరుపించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సూపర్ పిజి అలిండాయాలో 121 ర్యాంక్ సాధించిన నాగార్జునను స్వేరోస్ కమిటీ సభ్యులు అభినందించడంతో పాటు వారు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో స్వేరోస్ గౌరవ అధ్యక్షుడు స్కైలాబ్, నాయకులు రామస్వామి, భీముడు, రమేష్, అంజయ్య, పి ఇటి చంద్రశేఖర్ ఉన్నారు.