మహబూబ్‌నగర్

నిర్మాణాన్ని అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాలటౌన్, మే 3: నేనుచేపట్టిన నిర్మాణాన్ని అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని గద్వాల ఆర్డీఓ, ఇన్‌చార్జి కమీషనర్ అబ్దుల్‌హమీద్‌తో భవన యజమాని వాగ్వివాదానికి దిగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన సంఘటన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి కార్యాలయ సిబ్బంది కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయంలో ఇన్‌చార్జి కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న అబ్దుల్‌హమీద్ పట్టణంలోని సుంకులమ్మమెట్టు సమీపంలో అక్రమ కట్టడం చేపడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో స్పందించిన నిర్మాణాన్ని నిలిపివేయాలని యజమానికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని నవీన్‌కుమార్ కమీషనర్‌తో తీవ్రస్వరంతో పనులు ఎట్టపరిస్థితిలో ఆపేది లేదని తేల్చిచెప్పాడు. గద్వాలలో పలు అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోకుండా నన్నుమాత్రమే ఎందుకు నిర్మాణ పనులు చేయవద్దుంటున్నారన్నారు. ప్రభుత్వ అనుమతుల మేరకే నిర్మాణం చేపట్టానని తెలిపారు. నిర్మాణాన్ని కొనసాగిస్తానని, పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తానని, వాటిని కూల్చిన తరువాత నేను నిర్మిస్తున్న నిర్మాణాలు అక్రమవని తేలితే స్వయంగా కూల్చుకుంటానని అధికారులతో వాపోయారు. కమీషనర్ ఎట్టిపరిస్థితుల్లో పనులు చేపట్టవద్దని చెప్పినప్పటికి ఆవేశంతో మున్సిపల్ కార్యాలయం నుంచి ఆగ్రహంగా ఆత్మహత్య చేసుకుంటానని బయటకు వెళ్లిపోతుండడంతో మున్సిపల్ ఆవరణలో పలువురు ఉద్యోగులు, కౌన్సిలర్లు ఆయనను నివారించారు. కమీషనర్ మాట్లాడుతూ ఇలాంటి పనులు పునరావృతం కాకుండా ఉండాలని యజమానికి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీరు ఆత్మహత్య అంటూ భయబ్రాంతులకు గురిచేస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీఓ స్థాయి అధికారిపై భవన యజమాని, ఆయన మిత్రులు తీవ్ర పదజాలంతో మాట్లాడడం పట్ల పలువురు కౌన్సిలర్లు విస్మయానికి గురయ్యారు.
ఈ విషయంపై భవన యజమానిపై చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు వాపోయారు.