మహబూబ్‌నగర్

‘పేట’ రోడ్డు విస్తరణకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, మే 3: దశాబ్దాల కాలం పాటు ప్రజలు ఎదురుచూస్తున్న నారాయణపేట రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లబించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేపట్టేందుకు 28.50కోట్లు నిధులు విడుదల చేస్తూ జిఓఆర్‌టి నెం.206 తేది 2.5.2016న ఉత్తర్వులు జారీ చేసింది. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ స్కీం పథకం క్రింద నారాయణపేట పట్టణంలోని ప్రధాన రహదారిని విస్తరించేందకు సిఎం కెసిఆర్ సర్కార్ ఆమోద ముద్ర వేయడంతో పట్టణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల విస్తరణకు సంబందించి 28.50కోట్ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం అందులో ఎక్కడా లేని విధంగా ఎస్‌డిఎఫ్ నుండి దుకాణాలు, ఇళ్లు నష్టపోయే వారికి నష్టపరిహారం చెల్లించేందుకు 20.30కోట్ల నిధులు, రోడ్డు విస్తరణకు సంబందించి 8.20కోట్ల నిధులను కెటాయించింది. పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా నుండి దామర్‌గిద్ద రోడ్ వరకు గల ప్రధాన రహదారిని 1.7కిలోమీటర్ల మెర 80్ఫట్ల వెడల్పుతో డివైడర్లు, బట్టర్ ఫ్లై లైట్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయం పట్ల పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాట నిలుపుకొన్న ఎమ్మెల్యే
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అఖిలపక్ష సమావేశంలో నారాయణపేట రోడ్డు వెడల్పుపై ఇచ్చిన మాటను అధికారపార్టీలో చేరిన తరువాత మాట నిలుపుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తన మాటను పెడచెవిన పెట్టడంతో నియోజకవర్గ అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరానని ప్రకటించిన ఎమ్మెల్యే ఆ మెరకు అధికారపార్టీ ఎమ్మెల్యేగా దశాబ్దాల కాలంగా నారాయణపేట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య రోడ్డు వెడల్పును చేపట్టడం విశేషం. కేవలం అభివృద్ది కోసమే పార్టీ మారానన్న వాదనకు బలం చేకూరుస్తూ ఈ రోడ్డు వెడల్పును సాధించడం నిరూపిస్తోందని ప్రజలు వాఖ్యానిస్తున్నారు.