మహబూబ్‌నగర్

వట్టిపోయన జూరాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మే 3: జూరాల ప్రాజెక్టు నిర్మాణమై మూడు దశాబ్దాలు పూర్తయినా ఇంతటి దుర్బిక్ష పరిస్థితులు ఎప్పుడు దాపురించలేదు. ఈ ఏడాది ఆయకట్టు రైతులకు సాగునీరు అందించకపోగా ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న ప్రజల దాహార్థిని కూడ తీర్చలేక పోయింది. దాదాపు సగం జిల్లాకు తాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు నుంచి కాలువల్లోకి నీటిని తోడేందుకు రంగం సిద్దమైంది. చరిత్రలో ఎన్నడులేని రీతిలో జూరాల ప్రాజెక్టులో నీటి మట్టాలు పడిపోయాయి. ప్రాజెక్టు అధారిత బ్యాలెన్స్ రిజర్వాయర్లను రామన్‌పాడు, గోపన్‌పాడు, జములమ్మ రిజర్వాయర్లలోనూ నీరు అడుగంటింది. ఈ రిజర్వాయర్ల ఆధారంగా జిల్లాలో సగం ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పడిపోవడం తాగునీటికి నీటిని అందించాలంటే పంపులతో తోడాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అందుకు ఏర్పాట్లు చేసింది. మరో వారం పదిరోజుల్లో పనులు పూర్తిచేసి ప్రాజెక్టు కాలువలోకి నీటిని తోడేందుకు ఏర్పాట్లు ఉదృతం చేసింది. ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పనులు చేపట్టేందుకు తొలుత కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయించాలని గ్రామీణ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు యోచించారు. ఇందుకుగాను నల్లగొండ జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ తనకు పని అప్పగించాలని కోరుతూ ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం 1హెచ్‌పికి రూ.136 అడిగారని, ఇందుకు 1200హెచ్‌పి సామర్థ్యం గల మోటార్లను వినియోగిస్తానని సదరు కాంట్రాక్టర్ ప్రతిపాదించారని తెలిసింది. ఈ పనులు దక్కించుకునేందుకు సదరు కాంట్రాక్టర్ ఉన్నతస్థాయి వర్గాల నుంచి కూడ జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే ఈ కాంట్రాక్టర్ వేసిన అంచనాలకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదించిన లెక్కలకు మద్య భారీ వ్యత్యాసం ఉండడంతో అప్రమత్తమైన కలెక్టర్ పనులను స్వయంగా ప్రభుత్వశాఖలే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ కాంట్రాక్టర్ చెప్పిన లెక్కల ప్రకారం జూరాల నుంచి కాలువలకు నీరు తోడే పనికి మొత్తం దాదాపు రూ.2కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనావేశారు. ఈ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించిన కలెక్టర్ కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా సంబంధితశాఖల సమన్వయంతో నేరుగా ఆర్‌డబ్ల్యూఎస్ పనులు చేపట్టాలని ఆదేశించారని తెలిసింది. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసేందుకు ఉపయోగించే మోటార్లను శాశ్వత ప్రతిపాదికన వినియోగించుకునేందుకు వీలుగా (నీళ్లుతోడే పనులు ముగిసిన తరువాత కృష్ణ పుష్కరాల పనులలో ఉపయోగించుకునేలా) మోటార్లకు, పంపుసెట్‌లకు ఆర్డర్ ఇచ్చారు. 50హెచ్‌పి (అశ్వసామర్థ్యం) గల 20 మోటార్లను ఇందుకు ఉపయోగించాలని భావించిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఈ మేరకు కిర్లోస్కర్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా ఈ మోటార్లు నడిచేందుకు అవసరమైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు సమీపంలోని సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేసి పనులను ట్రాన్స్‌కోకు అప్పగించారు. జలాశయంలో పంపుల వద్దకు నీటిని అందించేందుకు వీలుగా చానల్స్ తవ్వకం పనులకు నీటిపారుదలశాఖను పురమాయించారు. స్వయంగా ప్రభుత్వశాఖల ద్వారానే ఈ పనులు చేపడుతుండడంతో రూ.75లక్షల నుంచి రూ.కోటి లోపు ఖర్చవుతుందని, తిరిగి తరువాత ఎప్పుడైన ఆర్‌డబ్ల్యూ ఎస్ ఉపయోగించుకునేందుకు ఉపయోగపడుతాయని అధికారులు చెబుతున్నారు. అడుగంటిన జూరాల జలాశయం నుంచి కాలువల్లోకి 116 క్యూసెక్కుల ప్రమాణంలో నీటిని తోడేందుకు వీలుగా డిజైన్ రూపొందించారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.94 టిఎంసిలకు గాను ప్రస్తుతం కేవలం 2.75 టిఎంసిల నీరు అందుబాటులో ఉంది. అయితే ఇందులోనూ దాదాపు 2 టిఎంసిల నీటి నిల్వ మేరా పూడికే ఉంటుందని, తాగునీటికి వినియోగించుకునేందుకు 0.75 టిఎంసిల నీరు మాత్రమే లభ్యవౌతుందని ఇంజనీర్లు చెబుతున్నారు.