మహబూబ్‌నగర్

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడ్జిల్, సెప్టెంబర్ 12: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా టీఅర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మిడ్జిల్ టీఆర్‌ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మారెడ్డికి ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఒకేసారి 105 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువయ్యారని మంత్రి అన్నారు. అందులో భాగంగా మూడవసారి జడ్చర్ల టికెట్‌ను లక్ష్మారెడ్డికి కేటాయించడంతో జడ్పిటీసీ హైమావతి, ఎంపీపీ దీప ఆధ్వర్యంలో బాణసంచా కాలుస్తూ భారీ బైకుర్యాలీతో మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి కార్యకర్తలతో పాటు బైకు నడిపి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఊర్కోండ మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి మంత్రి వెళ్లారు. ఈ భైకు ర్యాలీలో మండల అధ్యక్షుడు గిరినాయక్, వైస్ ఎంపీపీ సుదర్శన్, శ్రీను, శేఖర్, గోపాల్, రవింధర్, వెంకటయ్య, వెంకట్‌సాగర్, భాస్కర్, వరుణ్ , నవిన్‌చారి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి లక్ష్మారెడ్డికి ఘనస్వాగతం
బాలానగర్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, జడ్చర్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డి బుధవారం బాలానగర్ మండల కేంద్రంలో టీ ఆర్ ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీ ఆర్ జడ్చర్ల నియోజకవర్గం టికెట్‌ను లక్ష్మారెడ్డికి కేటాయించడంతో కార్యకర్తలు, అభిమానులు జిల్లా ముఖద్వారం బుర్గుల గేట్ వద్ద నుండి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. బాణసంచా కాల్చి కార్యకర్తలు బైక్‌ర్యాలీగా భారీ ఎత్తున జడ్చర్ల వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, శివకుమార్, వెంకటాచారి, గోపాల్‌రెడ్డి, సాయికృష్ణ, మైపాల్‌రెడ్డి, నరసింహులు, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్ని పార్టీలు కలిసినా టీఆర్‌ఎస్‌ను ఓడించలేవు
* మాధ్వార్‌లో టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ * పేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
ధన్వాడ, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిపార్టీలు కలిసిన టీఆర్‌ఎస్‌ను ఓడించాలేరని టీఆర్‌ఎస్ పార్టీ నారాయణ పేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మాధ్వార్‌లో టీఆర్‌ఎస్ అధ్వర్యంలో పార్టీ జెండాలను ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లోనే పేద ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మళ్లీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఆధికారంలోకి రావడం ఖాయమాన్నారు. గుర్తులు లేని వ్యక్తులు గ్రామాలలో తిరుగుతున్నారని, వారిని పట్టించుకోవద్దని, పనిచేసేవారికే ఓటు వేయాలన్నారు. అనంతరం పేట ఎమ్మెల్యేరాజేందర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వై.వెంకట్రామిరెడ్డి, మండల రైతు సమన్వయ కమిటి చైర్మన్ సంపత్‌కుమార్, మాధ్వార్ గ్రామ మాజీ సర్పంచ్ వెంకటయ్య, దస్తప్ప, నాయకులు బాలస్వామి, మూర్తి, వెంకటయ్య, నర్సిరెడ్డి, వీరరఘవారెడ్డి, భీంరాజ్, రాజులయ్య , మాధ్వార్ గ్రామ అధ్యక్షులు బాలస్వామి,విష్ణువర్థన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి,రాజన్న, నగేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.