మహబూబ్‌నగర్

ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, సెప్టెంబర్ 21: ఓటర్ల ముసాయిదా జాబితా ఆధారంగా రాష్ట్రంలో రెండవ ప్రత్యేక సమగ్ర సవరణలో భాగస్వాములైన ప్రతి ఉద్యోగి తమ తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ మిలందు భాప్నా అన్నారు. శుక్రవారం ఆయన మక్తల్‌లోని తహశీల్దార్ కార్యాలయంలో నమోదు అయిన ఓటర్ల వివరాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పట్టణంలోని 156,161కు చెందిన బూతులలోని బిఓఎల్‌లు చేస్తున్న ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, మృతి చెందిన వారికి సంబంధించిన ఫారం నెంబర్ 6,7,8,8ఏలను క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణంలోని ఎంపిఎస్ పాఠవాలలో ఏర్పాటు చేసిన పిఎస్‌లో నాలుగు పిఎస్‌లు ఉండటాన్ని ట్రైనీ కలెక్టర్ పరిశీలించి ఇక్కడున్న పిఎస్‌లను స్థలం అనుకూలంగా ఉన్న వాటికి మార్చేందుకై జిల్లా కలెక్టర్‌కు లేఖ వ్రాయాలని స్థానిక తహశీల్దార్ రాజీవ్‌రెడ్డిని ఆదేశించారు. అలాగే మక్తల్ మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డికి ఇచ్చిన ఓటర్ల నమోదుకు సంబంధించిన పనిని ఇంకా ప్రారంభించలేదని, ఫోన్ చేసిన ఎత్తడం లేదని, అలాగే ఊట్కూర్, ఆత్మకూర్ మండలాల వారు సైతం ఓటర్ల పనిని వేగవంతం చేయడం లేదని తహశీల్దార్ ట్రైనీ కలెక్టర్ ధృష్టికి తీసుకెళ్లాడు. ఫోటోలు రెండు చోట్ల ఒకే ఫోటో ఉంటూ, సక్రమంగా లేని వారికి సంబంధించిన వివరాలను ట్రైనీ కలెక్టర్ వివరించగా కృష్ణా మండలం 27, మక్తల్ 254, ఊట్కూర్ 141, నర్వ 98, అమరచింత 52, ఆత్మకూర్ 247, మరికల్ 27లు నమోదైనట్లు తెలిపారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత కంప్టూర్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటరు నమోదు విషయంలో పూర్తిస్థాయి బాధ్యత తీసుకొని కొత్త ఓటర్ల నమోదు చేసుకొనుటకు, ఓటర్ల జాబితాల్లో మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని తొలగించడం, వివిద సవరణలకు సంబంధించిన ఫారాలను క్షుణ్ణంగా నింపి ఎలాంటి తప్పులు లేకుండా కంప్యూటర్‌లో అప్‌లోడ్ అయ్యే విదంగా చూడాలని ట్రైనీ కలెక్టర్ మిలందుభాప్నా తహశీల్దార్ రాజీవ్‌రెడ్డికి తెలియచేశారు. పిఎస్‌లు, బూతుల పరిశీలనలో ఎన్నికల డిటి సురేష్‌కుమార్, ఆర్‌ఐ మధన్‌మోహన్‌రెడ్డిలు ఉన్నారు.