మహబూబ్‌నగర్

కాంగ్రెస్, టీఅర్‌ఎస్‌కు చరమగీతం పాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, సెప్టెంబర్ 23: ప్రజా సమస్యలు గాలికి వదిలేసి స్వలాభపేక్షగా పనిచేసిన కాంగ్రెస్, టీఅర్‌ఎస్‌లకు చరమగీతం పడి తనకు ఓక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజీ ఆచారి అన్నారు. అదివారం వెల్దండ మండలం చోక్కన్నపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్, టీఅర్‌ఎస్ పార్టీలు అధికార దాహంతో కోట్టు మిట్టాడుతున్నాయని అన్నారు. దశాబ్ధాల తరబడి కాంగ్రెస్, నాలుగున్నర ఏళ్ల పాటు టీఅర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్నాయన్నారు. బంగారు తెంగాణ పేరుతో రాష్ట్రాన్ని కుటుంబానికి దరాధత్తం చేసి అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్‌కే దక్కుతుందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో, గిరిజన తాండల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, తాగునీటీ పథకాలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి జరిగిందని ఆయన గుర్తు చేశారు. సొమ్ము బీజేపీ ప్రభుత్వానిది సోకు మాత్రం టీఅర్‌ఎస్ ప్రభుత్వానిదని ఆయన నిశితంగా విమర్శించారు. ఓటమి భయంతో ముందుస్తు ఎన్నికలకు పోతున్న టీఅర్‌ఎస్‌కు, ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి ఎలాంటి స్వార్ధ చింతన, పార్టీ మారకుండా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనకు అవకాశం కల్పించాలని ఆచారి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు జంగయ్యయాదవ్, బీజేపీ రాష్ట్ర, జిల్లా, తాలుకా, మండల నాయకులు శేఖర్‌రెడ్డి, కృష్ణయ్య, కృష్ణారెడ్డి, బాలస్వామి, శ్రీనివాసులు, పరమేష్‌గౌడ్, రామకృష్ణ, దామోదర్, శివ, పాండు, శ్రీనివాస్‌రెడ్డి, సంతోషాచారి, జనార్ధన్, శశిధర్‌రెడ్డి, గోవర్ధన్, తాంబలు పాల్గొన్నారు.

చేనేత రుణమాఫీని తక్షణం ప్రకటించాలి
నారాయణపేటటౌన్, సెప్టెంబర్ 23: చేనేత కార్మికుల రుణాలను తక్షణం మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చేనేత సహకార సంఘం అధ్యక్షులు పగడాకుల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో జరిగిన చేనేత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందని, చేనేత రంగం కేవలం ఉత్తర తెలంగాణలోనే తెలంగాణ చేనేత పరిశ్రమ ఉన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీంతో దక్షిణ తెలంగాణలోని చేనేత కార్మికులు దినదిన గండంలా మారిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోపోవడం శోచనీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి సంవత్సరాలు గడచిపోతున్నా నేటికి ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి పాత రుణాలను మాఫీ చేసి ప్రతి చేనేత కార్మికుడికి లక్ష రూపాయల రుణాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెంచె శ్రీనివాసులు, కొంగరి రాములు, యంగలి రఘురాములు, సి.నారాయణరావు, చందులాల్, సంగ రాములు, బోగం భాస్కర్, కెంచె నారాయణ, ఏర్వ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించండి
లింగాల, సెప్టెంబర్ 23: అన్నీ వర్గాల ప్రజలకు సముచితమైన స్థానంతోపాటు ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం చెన్నంపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నిరుపేదల అభివృద్ది కోసం అమలుచేస్తున్న పథకాలు వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని, మేధావులతో ప్రశంసలు పొందాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్, నాయకులు మాకం తిరుపతయ్య, కేటీ తిరుపతయ్య, నర్సింహ్మాగౌడ్, కోనేటి తిరుపతయ్య, రాణోజీ తదితరులు పాల్గొన్నారు.

బడుగుల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
లింగాల, సెప్టెంబర్ 23: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివారం పద్మన్నపల్లి గ్రామంలో వివిధ పార్టీల నాయకులు, యువకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధే తప్ప టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. రానున్న ఎన్నికలలో హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్‌రావు, లక్ష్మణ్, ఇందిరమ్మ, తరుణ్, శివ, వెంకటయ్యగౌడ్, ధర్మనాయక్ పాల్గొన్నారు.