మహబూబ్‌నగర్

ఎస్సీ, ఎస్టీ చట్టాల పరిరక్షణకు కేంద్రం ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పరిరక్షిస్తుందని అందులో భాగంగానే ఇటివల దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఉన్న అనుమానాలను ప్రధాని నరేంద్రమోడి తొలగించారని చట్టాల పరిరక్షణకు మరింత పెద్దపీట వేశారని జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్, దళిత, గిరిజనుల విజయోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ భారతరాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అశయాలకు అనుగుణంగానే ప్రదానీ నరేంద్రమోది నడుచుకుంటున్నారని తెలిపారు. కొందరు కుహానా మేదావులు దళితులకు, గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేసే సంఘాలు ఈ వర్గాల్లో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారన్నారు.
ప్రజాసంఘాల రాష్టవ్య్రాప్త ఉద్యమం
విపక్షాల హెచ్చరిక * సబ్ రిజిస్ట్రార్‌కు మద్దతుగా ధర్నా, రాస్తారోకో
జడ్చర్ల, సెప్టెంబర్ 24: జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్‌పై అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్‌లు దాడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సిగ్నల్ గడ్డ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అశోక్ కుమార్‌పై దాడి పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటు ప్రతిపక్ష పార్టీల తో పాటు, అధికారులు, ఉద్యోగులు ఎకతాటి పైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ పై దాడి చేసిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. విపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఓ వైపు ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించగా, మరో వైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తమ అధికారిపై దాడికి నిరసనగా కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈసందర్బంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులతో పాటు ఎస్సి,ఎసిటి,బిసి,మైనార్టీ సంఘాల నాయకులు మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్‌పై దాడిని త్రీవంగా నిరసించారు. అగ్ర వర్ణాల దురహంకారానికి ఈదాడి నిదర్శనమని వారు పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో గత నాలుగున్నర సంవత్సరాలలో ప్రజా వ్యతిరేఖ పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఇంతటి నేరం చేసినా దోషులను కఠినంగా శిక్షించడంలేదని, అందువల్లే వారు దురహంకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అగ్రవర్ణాలకు చెందిన జిడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి అహంకారపూరితంగా బిసి వర్గానికి చెందిన అశోక్ కుమార్‌పై చేయి చేసుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగదని వారు అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేధన వ్యక్తం చేశారు. అశోక్ కుమార్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు,విపక్ష పార్టీల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపుల వాహానాలు బారులు తీరి నిలిచిపోవడంతో ట్రాఫీక్ స్తంభించింది. ఈ కార్యక్రమంలో బిసి సబ్ ప్లాన్ రాష్ట్ర కార్యదర్శి కిల్లే గోపాల్,డిసిసి జిల్లా కార్యదర్శి నిత్యానందం, కాంగ్రెస్ ఒబిసి సెల్ రాష్ట్ర కన్వీనర్ బాలవర్థన్ గౌడ్, బిసిసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

పాలమూరుపై ఎవరి ధీమా వారిది!
* మహాకూటమిలో ఉత్కంఠ రేపుతున్న
మహబూబ్‌నగర్ టికెట్
* కాంగ్రెస్‌లో అరడజనుకుపైగా
ఆశావహులు, అధిష్టానానికి దరఖాస్తులు
* టీడీపీ జిల్లా అధ్యక్షుడు శేఖర్ పట్టు..
* టీజేఎస్ జిల్లా ఇన్‌చార్జి
రాజేందర్‌రెడ్డి యత్నం..
* మహాకూటమిలో మహబూబ్‌నగర్ అభ్యర్థిత్వంపై ఎవరి అంచనాలు వారివే

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. దాంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ టికెట్ ఎవరికి వెళ్తుందోనని అంతా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థి ఫలానా వ్యక్తి అని ప్రకటించనప్పటికీ నాయకులు మాత్రం ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని తమ అనుచరులతో ధీమా వ్యక్తం చేశారు. కానీ మహాకూటమిలో భాగంగా మహబూబ్‌నగర్ టికెట్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్న వారిలో మహాకూటమి భాగస్వామ్య పార్టీల నాయకులందరు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం జిల్లా కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే పరిస్థితి ఉండదని చెబుతుండగా ఈ పార్టీలో కొందరు టికెట్ ఆశిస్తున్న నేతలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి వచ్చే ఎన్నికల్లో తమకు మహబూబ్‌నగర్ టికెట్ ఇవ్వాలంటూ దాదాపు అర్ర డజన్ మంది నేతలు ధరఖాస్తులు పెట్టుకున్నారు. అందులో భాగంగా డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, టీపీసీసీ కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, ఎన్‌పి వెంకటేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివంగత పులివీరన్న సతీమణి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పులి అంజనమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ డీసీసీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ బ్రహ్మాయ్యలు అధిష్టానానికి దరఖాస్తులు పెట్టుకున్న వారిలో ఉన్నారు. అయితే ఇందులో ఓ ముగ్గురు నేతలు మాత్రం టికెట్ కోసం చాలా ప్రయత్నాలు మొదలుపెట్టిన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మహాకూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సైతం ఈ ధపా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. కూటమిలో మహబూబ్‌నగర్ టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎర్రశేఖర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ తన అన్న దివంగత ఎర్రసత్యం అనుచరులతో పాటు తన అనుచరులను కలుస్తూ తాను మహబూబ్‌నగర్ నుండి పోటీ చేస్తున్నానని అందరు ఇక కలిసి రావాలని టీఆర్‌ఎస్ ఓడిపోవాలంటే తానే సరైన అభ్యర్థినంటూ ఎర్రశేఖర్ ప్రచారం చేసుకుంటున్నారు. ఇకపోతే తెలంగాణ జనసమితి సైతం మహబూబ్‌నగర్ టికెట్‌ను ఆశిస్తుంది. జిల్లా ఇన్‌చార్జి రాజేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ టికెట్‌ను ఆశిస్తూ కోదండరాంతో తరుచూ బేటీ అవుతూ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి టికెట్ టీజేఎస్‌కే ఇవ్వాలంటూ కోదండరాం మహాకూటమిలో చర్చలో భాగంగా కోరిన్నట్లు తెలుస్తుంది. తన కోదండరాం నుండి స్పష్టమైన సంకేతాలు వచ్చాయని అందుకే తాను మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నానని రాజేందర్‌రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 30 వతేదీన తెలంగాణ జనసమితి ప్రజాగర్జన సభను మహబూబ్‌నగర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను సోమవారం బహిరంగ సభ ఫోస్టర్లను రాజేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. అయితే తెలంగాణ ఇంటి పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం మహాకూటమిలో తాము కూడా ఉన్నామని ఇప్పటికే తాము కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నామని మహబూబ్‌నగర్ టికెట్ తనకే వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే మహాకూటమిలో రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయం తేలకముందే మహబూబ్‌నగర్‌లో మాత్రం కూటమిలో భాగస్వామ్య పార్టీల నేతలు మాత్రం ఎవరికి వారుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించుకుంటూ తమ అనుచర గనం చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని పార్టీలో మహాకూటమి అభ్యర్థిత్వంపై ఎప్పుడు ఉత్కంఠతకు తెరబడుతుందోలేదో కానీ ప్రస్తుతం మాత్రం అందరి దృష్టి మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎవరనే విషయంపైనే జోరుగా చర్చ జరుగుతోంది.