మహబూబ్‌నగర్

మూఢనమ్మకాల వెంటపడుతున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 14: మూడనమ్మకాలను కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నట్లు ఉందని వాటి వెంటపడి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ఎద్దేవా చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని మైదానంలో బీజేవైఎం ఆధ్వర్యంలో యువభేరి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు విచ్చేసిన కేంద్రమంత్రి సదానందగౌడ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శృంగభంగం తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఇప్పటి వరకు ప్రజలకు సమాధానం చెప్పలేకపోయారని ప్రజలు ముందస్తు ఎన్నికలను స్వాగతించడంలేదని అన్నారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 2014లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని కానీ కేసీఆర్ తెలివితక్కువతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన్నట్లుగాప్రజలు భావించుకుంటున్న విషయాన్ని ఆయన గ్రహించుకోవాలని హితవుపలికారు. 2019లో జరిగే సాధారణ ఎన్నికల సమయంలో వెళ్లిన్నట్లు అయితే బీజేపీని తట్టుకోలేమని భయంతో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన అన్నారు. కానీ త్రిపుర తరహాలోనే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకభూమిక ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అత్యధికంగా నిధులు ఇచ్చిందని కానీ కేసీఆర్ మాత్రం ఈ నిధుసలను మోదీ ఇచ్చారని మాత్రం చెప్పడంలేదని అందుకే ఎన్నికల ప్రచారంలో ప్రతి బీజేపీ కార్యకర్త కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులు, సంక్షేమ పథకాలపై విసృత్త ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆర్థిక భారం పడదని భావించిన ప్రధానమంత్రి నరేంద్రమోధీ ఈ విషయాలను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలిపారు. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సైతం చెప్పారని అందుకు ఈయన ఓకే అన్నారని తెలిపారు. కానీ మూడనమ్మకాల పిచ్చిముదిరి ముందస్తు ఎన్నికలకు వెళ్లారనే ప్రచారం జరుగుతుందని తాము కూడా అలాగే భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో వేసిన రోడ్లు కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. నూతన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిందిపోయి ఓవైసీ సోదరుల కాళ్లముందు పెట్టడం విచారకరమని ఇది కేసీఆర్‌కు తగదన్నారు. ఓవైసీతో జతకట్టిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తమ ఓటు ద్వారా చూయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి తదితరులు పాల్గొన్నారు.