మహబూబ్‌నగర్

మొదటి రోజు నామినేషన్లు నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, నవంబర్ 12: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారం నుండి మొదలైనప్పటికి మొదటి రోజు సోమవారం ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్లు వేయాలేదని రిటర్నింగ్ అధికారి చంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటల వరకు సాయంత్రం 3గంటల వరకు నామినేషన్లు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, నామినేషన్లు తీసుకోవడానికి తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. వంద మీటర్ల దూరం వరకు భారికేడ్లు నిర్మించామని, అభ్యర్థులు చోచ్చుకొని రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రావడానికి ఉన్న రెండు మార్గాల్లో ఒక మార్గాన్ని మూసి ఉంచి ఒకే మార్గం నుండి వచ్చి పోయ్యే విధంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సి ఐ, ఎస్ ఐలు,పోలీసులు బందోబస్తులో పాల్గొన్నట్లు తెలిపారు.

ప్రత్యేక నిఘా
కోస్గి, నవంబర్ 12: శాసన సభా ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నామినేషన్లపర్వం మొదలైంది. దీంతో పోలీసులు ప్రత్యేక పోలీసు బలగాలు 60మంది 5 టీబులుగా బయలుదేరి ప్రత్యేక నిఘా పెంచే పనిలోపడ్డారు. నియోజకవర్గంలో ప్రధాన పట్టణమైన కోస్గి పట్టణంలో సోమవారం సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికలకోడ్ నియామావళిని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా పట్టణం మీదుగా వచ్చి పోయే ప్రతీ వాహణాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.