మహబూబ్‌నగర్

మహాకూటమి నేతలకు సీట్లు, పదవులే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, నవంబర్ 13: మహకూటమి నేతలు సీట్లు, పదవులు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోరని తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మదనాపురం మండలంలోని గోవింద్‌హళ్లి, మదనాపురం, దంతనూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్బ్భంగా ఆయన మాట్లాడుతూ కూటమికి ఓటువేస్తే తెలంగాణ అభివృద్ధిలో 60 ఏళ్లు వెనక్కి వెళుతుందని, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ రాకున్నా అడ్డుకున్న వారితో జత కట్టి ఇప్పుడు ప్రజల ముందుకు రావడం సిగ్గు చేటన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి ఢిల్లీకి 33 లేఖలు రాశారని, తెలంగాణలో రాజకీయ విచ్ఛిన్నం చేయడానికి రేవంత్‌రెడ్డి రూపంతో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని, కేసీఆర్ నాలుగేళ్లలో చేసి చూపించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలో ఆదర్శంగా నిలిచారన్నారు. మరోసారి కేసీ ఆర్‌ను తనను ఆశీర్వదిస్తే దేవరకద్ర నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాలలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి భారీ ర్యాలీలతో ఘనస్వాగతం పలికారు. ఇంటింటి తిరుగుతూ ఓట్లు అడిగారు. కాగా ఆర్టీసి బస్సులోకి ఎక్కి ప్రయాణికులను ఓట్లు అడిగారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కృష్ణయ్య, వెంకట్‌నారాయణ,జయంతి, వాసురెడ్డి, రవీందర్‌రెడ్డి, చాంద్‌పాష, గోపినాయక్,వెంకటేష్,గోపిస్వామి, బాలకృష్ణ, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, విష్ణు,రమేష్ పాల్గొన్నారు.