మహబూబ్‌నగర్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 15: ఎన్నికల నియామవళిని తు.చ తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే ఎన్నికల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ్ధర్ హెచ్చరించారు. గురువారం పట్టణంలోని వేర్వేరు చోట్ల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 600 మంది ప్రొసీడింగ్, అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణ కోసం 1800 మంది ఉద్యోగులను నియమించగా, గురువారం 600 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, మిగతా వారికి శుక్ర, శనివారాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల నియామవళి ప్రకారం నడుచుకోవాలని, ఏవైనా అనుమానాలు ఉంటే ఇక్కడే నివృత్తి చేసుకోవాలన్నారు. సమయ పాలన విధిగా పాటించాలన్నారు. ఎవ్వరైన విధులను విస్మరిస్తే చట్టప్రకారం అట్టివారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది అందరికి పోలింగ్ కేంద్రాల వద్ద సాధ్యమైనంత వరకు అన్నీ వౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు.
ఎన్నికల అధికారులకు ఇచ్చిన హాండ్‌బుక్‌ను పూర్తిగా చదివి ఈ సారి ఎన్నికలలో వచ్చిన మార్పులను గమనించాలని సూచించారు. . ఈవీఎం, వీవీప్యాట్‌లపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఏర్పడితే కంపెనీ ఇంజనీయర్ల ప్రతినిధులతో నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారి సుధాకర్, ఎన్నికల సిబ్బంది నోడల్ అధికారి సింగారెడ్డి, డీఈవో సహదేవుడు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ పాలనను ఇంటికి పంపుదాం
* మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 15: కుటుంబపాలనతో ప్రజలు విస్తుపోయారని వచ్చే ఎన్నికల్లో కుటుంబపాలనను ఇంటికి పంపించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆరోపించారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్‌హల్‌లో టీఆర్‌ఎస్‌కి చెందిన మైనారిటీ నాయకులు ఎర్రశేఖర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గారడిమాటలతో ప్రజలను మభ్యపెట్టి ఏ ఒక్కహామీని అమలుపర్చలేదని కేవలం వారి కుటుంబసభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి లబ్దిపొందేలా చేశాడని విమర్శించారు. చంద్రబాబునాయుడుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రపదజాలంతో మాట్లాడుతున్నారని ప్రజలు కూడా ఆయన మాటలను గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో మహాకూటమిదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రహమాన్, మాజీద్‌ఖాన్, హుస్సెన్, అప్జల్, సమ్మద్‌ఖాన్ పాల్గొన్నారు.