మహబూబ్‌నగర్

అడుగడుగునా తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 15: అడుగడునా తనిఖీలు మొదలయ్యాయి. ఎవరైనా సరే జిల్లాలోకి అడుగుపెడుతున్నారంటే చాలు ముందుగా పోలీసుల తనిఖీలు జరగాల్సిందే. జిల్లా సరిహద్దులో కట్టు దిట్టమైన భద్రతలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని సమస్యాత్మకమైన గ్రామాలపై పోలీస్ నిఘాను ఉంచారు. ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదాం చుట్టు పోలీసు జాగిలాలతో తనిఖీలు చేశారు. డాగ్‌స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి తనికీలు ముమ్మరం చేశారు. అంతేకాకుండా నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ కార్యాలయాల దగ్గర సైతం తనిఖీలు చేశారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని జాతీయ రహదారి వెంట గల దుకాణాల్లో సైతం డాగ్‌స్క్వాడ్లతో తనిఖీ చేస్తుడడంతో వ్యాపారులు, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇకపోతే రహదారుల వెంట పోలీసుల కవాతులు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఎన్నికల పరిశీలకులు సైతం రంగంలోకి దిగారు. నామినేషన్లు వేస్తున్న సమయంలో నాయకులు చేస్తున్న హాంగామాపై కూడా నిఘా ఉంచారు. వీడియోల ద్వారా ర్యాలీలను బంధించి ఎప్పటికప్పుడు పై అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక్కరిద్దరు పరిశీలకులు విచ్చేశారు. ఇదిలాఉండగా జిల్లాలోని సమస్యాత్మకమైన గ్రామాలపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టారు. అయా గ్రామాలకు వెళ్లే రహదారులను తమ గుప్పెట్లోకి తీసుకుని ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లే రహదారుల వెంట వందలాది మంది పోలీసులు మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాహనాల తనిఖీల సందర్భంగా ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నప్పటికిని అయా జిల్లాల ఎస్పీలు ఎన్నికల దృష్ట్యా ప్రజలు సహకరించాలని సూచించారు. హైదరాబాద్ నుండి జిల్లా కేంద్రాలకు వచ్చే రహదారుల వెంట ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నారాయణపేట, జడ్చర్ల బస్టాండ్లలలో డాగ్‌స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు చేస్తున్నారు. పాఠశాలల దగ్గర సైతం తనిఖీలు చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నడూలేని విధంగా పోలీసులు వివిధ ప్రాంతాలలో తనిఖీలు చేస్తూ హాల్‌చల్ సృష్టిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం పోలీసల కవాతులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి గురువారం ఓ ప్రకటన విడుదల చేస్తూ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల దృష్ట్యా అందరు పోలీసులకు సహకరించిన్నప్పుడే ప్రశాంత వాతవారణంలో నిర్వహించడానికి వీలుపడుతుందని పెర్కొన్నారు. గ్రామాల్లో ఎన్నికల దృష్ట్యా రాజకీయ గొడవలకు కారణం అయ్యే వారిని హపేక్షించమని ఆమే హెచ్చరించారు.