మహబూబ్‌నగర్

రేనివట్ల వివాదంపై వికారాబాద్ కలెక్టర్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దూర్, నవంబర్ 17: మండలంలోని రేనివట్లలో ఈ నెల 14నజరిగిన వివాదంపై శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ విచారణ చేపట్టారు. గ్రామంలో ఈ నెల 14వ తేది రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం అనంతరం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. రేనివట్ల గ్రామంలో జరిగిన సంఘటనపై రేవంత్‌రెడ్డి ఎన్నికల కమీషనర్ రజిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు, పోలీసులు తమపై ఆకారణంగా దాడులు చేస్తున్నారని ఎన్నికల కమీషనర్‌కు ఫిర్యాదులో పెర్కోన్నారు. ఈ విషయమై గ్రామ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో టీఆర్‌ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో నెలకొన్న వివాదంపై వికారాబాద్ కలెక్టర్ గ్రామంలో విచారణ చేపట్టారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులతో వివరాలు సేకరించారు. దాంతో పాటు ప్రజలతో కూడా కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. నారాయణపేట డిఎస్పీ శ్రీ్ధర్, సిఐ శ్రీనివాస్‌రావులను కూడా విచారించారు.
అది దొంగల కూటమి!
* రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
బలానగర్, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఏర్పడిన మహకూటమి కాదు.. దొంగల కూటమి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం బాలానగర్ మండల పరిధిలోని తిరుమలగిరి, పెద్దబావితాండ, గౌతంపల్లితాండ, చిన్నరేవల్లి, పెద్దరేవల్లి తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. వచ్చే ఏడాది నుండి రైతు పెట్టుబడి పథకం కింద ఎకరాకు రూ.10వేలు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. 70 ఏళ్లుగా ఆంధ్ర పాలకులు తెలంగాణ తీరని ద్రోహం చేసినట్లు ఆయన వివరించారు. ప్రజా సంక్షేమం కోసం పాడుపడే పార్టీని ప్రజలు ఆదరించి ఓటు వేయాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, సాయికృష్ణ, నరసింహులు, లక్ష్మణ్‌నాయక్, శ్రీనివాస్‌గౌడ్, జగన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.