మహబూబ్‌నగర్

అబద్ధాలకోరు కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, నవంబర్ 17: అబద్దాలతో పాలన చేసిన కెసిఆర్ ఓ అబద్దాలకోర్ అని హనుమంతరావు మండిపడ్డారు. దళితులు ముఖ్యమంత్రిగా పనిచేయలేరని పదవి నుంచి తొలగించారు. డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నివారం ఉండవెల్లి మండల పరిధి అలంపూర్ చౌరస్తా సమీపంలో అలంపూర్ ఆవేదన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి వి.హనుమంతరావు మాట్లాడుతూ అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించి దొరల పాలన కొనసాగించారని మండి పడ్డారు. మహా కూటమి ప్రజల కూటమి అని ప్రజా కూటమిలో కెసిఆర్ కొట్టుకొని పోతారన్నారు. రాఫెల్ కుంభకోణంతో మోసం చేసిన నరేంద్రమోడికి మద్దతు ఇస్తున్న కెసిఆర్ ఓ అవినీతి పరుడన్నారు. కెసిఆర్‌కు ఓటేస్తే నరేంద్రమోడికి ఓటు వేసినట్లేనని హెచ్చరించారు.
బత్తేబాజ్ కెసిఆర్ : మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి
అధికారంలోకి రాక ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలు అలంపూర్ తాలూకాలో నెరవేర్చని కెసిఆర్ ఓ బత్తేబాజ్ అని చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూంలు ఇస్తానని తాలూకాలో ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వచ్చే ఎండాకాల సమావేశాలలో ఇంటి నిర్మాణాలకు రూ.5 లక్షలు, రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. సంపత్‌ను మరోసారి ఆశీర్వాదించాలని పిలుపు నిచ్చారు. గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
అందరిలా పార్టీలు మారే వ్యక్తిని కాను: కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్
అందరిలా పార్టీలు మార్చే సిద్దాంతాలు తనకు లేవని కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని వీడనని కాంగ్రెస్ అభ్యర్ది సంపత్‌కుమార్ అన్నారు. అలంపూర్‌కు వరాలు కురిపించిన కెసిఆర్ కనపించకుండా పోయాడని ఎద్దేవా చేశారు. కమీషన్లు దండుకుంటూ పార్టీలు మారుతున్నారని పరోక్షంగా తెరాస అభ్యర్థి అబ్రహంపై విరుచుకుపడ్డారు. చల్లా వెంకట్రామిరెడ్డి అండగా ఉన్నంత వరకు ఓటమి ఎరుగనన్నారు. మరోసారి ఆశీర్వాదించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, తెదేపా మహిళా అధ్యక్షురాలు హేమమాలిని, సిపిఐ ఆంజనేయులు, తెదేపా నియోజకవర్గ ఇన్‌చార్జి ఆంజనేయులు, తెదేపా నాయకులు పూర్ణచంద్రరావు, నాయకుల పరమేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, గజేందర్‌రెడ్డి,వేణిరెడ్డి, ఆంజనేయులుగౌడ్, శేషిరెడ్డి, నారాయణగౌడ్ , మాజీ జడ్‌పిటిసి మద్దిలేటి, గోపాల్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.