మహబూబ్‌నగర్

అరకొర వసతుల మధ్య టెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మే 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెట్ పరీక్షకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం గద్వాల డివిజన్ కేంద్రంలో నిర్వహించిన పరీక్షలు అరకొర వసతుల మధ్య కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలపై తనిఖీల పేరిట వేదింపులకు గురి చేస్తోందని ఆగ్రహిస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు టెట్ పరీక్షను నిర్వహించేందుకు ఒప్పుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, పాలిటెక్నిక్ విద్యా సంస్థల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల టేబుళ్లు సరిగ్గా లేకపోవడంతో కాళ్లపై పెట్టుకొని పరీక్షలు రాశారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమైనట్లు అభ్యర్థులు వాపోయారు. గద్వాల పాలిటెక్నిక్ కళాశాల అడ్రస్ మార్పుపై అభ్యర్థులు కొన్నిగంటల సేపు ఉత్కంఠతకు లోనయ్యారు. గద్వాలలోని కె ఎల్ ఐ క్యాంప్‌లో గతంలో పాలిటెక్నిక్ కళాశాల నిర్వహించగా నూతంగా అక్కడి నుంచి గోన్‌పాడు సమీపంలో ప్రభుత్వ బిల్డింగ్‌లో కళాశాల ఏర్పాటు చేశారు. ఈ విషయంపై అభ్యర్థులకు సరైన సమాచారం లేక పోవడంతో కె ఎల్ ఐ క్యాంప్‌కు వచ్చి ఆరా తీశారు. గోనుపాడులో కళాశాల ఉన్నట్లు నిర్దారించుకొని ఉరుకులు, పరుగులతో అక్కడికి చేరుకోవాల్సి వచ్చింది. గద్వాల డివిజన్‌లో పేపర్-1 2880 అభ్యర్థుల్లో 309 మంది గైర్హాజరయ్యారు, పేపర్-2లో 4032 అభ్యర్థుల్లో 425 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 6178 మంది 17 సెంటర్లలో పరీక్షలు రాశారు. రెవెన్యూ, పోలీస్, పంచాయితీరాజ్ ఉద్యోగులు పరీక్షా కేంద్రాల వద్ద ఉండి పరీక్షలు సక్రమంగా జరిగేందుకు కృషి చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులను వెంట పెట్టుకొని పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.