మహబూబ్‌నగర్

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊట్కూర్, మే 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వీనియోగం చేసుకోవాలని చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ వెంకటమ్మ అధ్యక్షతన నిర్వహించిన దీపం పథకం కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరై డ్వాక్రా మహిళలకు సిలిండర్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు. మండలానికి 974 సిలీండర్లు మంజురు అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలోని ప్రతి మహిళలు డ్వాక్రాగూపుల్లో ఉండాలని అన్నారు. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని అయన తెలిపారు. ఒక్కో సిలిండరు రూ. 3050 మాత్రమే ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 5కోట్లు సెలిండర్లను మంజురు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు ఇంట్లో సిలీండర్లను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని సిలీండరు వెలుగించే ముందు సిలీండరు అన్‌చేయాలని అయన సూచించారు. లేదంటే చాలా ప్రమాదకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూర్యప్రకాష్‌రెడ్డి, సింగల్ విండొ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపిటిసిలు గోవిందప్ప, విజయసింహరెడ్డి, ఐన్‌డియన్ గ్యాస్ అసిస్టేంట్ మెనేజర్ విజయకుమారి, అయా గ్రామాల సర్పంచులు, అయా గ్రామాల డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.