మహబూబ్‌నగర్

మొక్కుబడి పనులు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 27: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌కాకతీయ పనులను మొక్కుబడిగా చేపడితే సహించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని చెరువులో మిషన్‌కాకతీయ పనులను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్‌కాకతీయ పథకంలో భాగంగా చెరువులలో పూడిక తీత పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో చెరువులను ఎవరు పట్టించుకోకపోవడంతో గంగాళం లాంటి చెరువులు తాంబాలంలా మారాయని అన్నారు. 11వందల సంవత్సరాల క్రితం కాకతీయ రెడ్డి రాజులు చెరువులను నిర్మించారని, ఆతరువాత ఎప్పుడూ చెరువుల మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో చెరువులు పూర్తిగా కూరుకుపోయాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుచెరువులకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకుగాను మిషన్‌కాకతీయ పథకంలో భాగంగా చెరువులలో పూడిక తీత పనులను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. సీమాంధ్రుల పాలనలో చెరువుల మరమ్మతుల కోసం లక్ష రూపాయలను మంజూరు చేయాలని చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగితే మంజూరు చేసే వారు కాదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల కోసం, వారి సంక్షేమం కోసం చెరువుల మరమ్మతసవస చేపట్టేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. తూతూ మంత్రంగా పనులు చేపడితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ మాట్లాడుతూ రైతులను అభివృద్ద్ధి చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకంలో భాగంగా చెరువుల మరమ్మత్తుల పనులు చేపట్టడం జరుగుతుందని, దీంతో వర్షాకాలంలో నీటి నిల్వతో భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బాదం శివకుమార్, ఫరూఖ్‌నగర్ ఎంపిపి బుజ్జీబాబునాయక్, గ్రామ సర్పంచ్ అరుంధతి, ఎంపిటిసి సభ్యురాలు కృష్ణవేణి, ఉప సర్పంచ్ సునీత, నాయకులు పంది వెంకట్‌రాంరెడ్డి, అందె బాబయ్య, కందివనం సూర్యప్రకాష్, జాంగారి నర్సింలు, రవి పాల్గొన్నారు.