మహబూబ్‌నగర్

త్వరలో ఆర్టీసీకి పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, మే 27: రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థను నష్టాల నుండి లాభాల్లోకి తీసుకువస్తామని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం దేవరకద్ర పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతనంగా ఏడు బస్సులను మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రస్తుతం రూ.220 కోట్ల అప్పుల్లో ఉందన్నారు. అయినప్పటికి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు పడకూడదని అదనంగా దేవరకద్ర నుండి బాదేపల్లి, నవాబుపేట, మహబూబ్‌నగర్‌కు బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో బిటి రోడ్డులను నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉండకూడదనే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని తెలిపారు. ఇందుకోసం బిటిరోడ్డు సౌకర్యం గ్రామాల నివేదికలను సమర్పించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎంపిపి ఇవి గోపాల్, జడ్పిటిసి లక్ష్మీకాంత్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, కొండ శ్రీను పాల్గొన్నారు.