మహబూబ్‌నగర్

పార్టీని వీడింది అవినీతిపరులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, జూన్ 17: కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్‌ఎస్ట్‌లో చేరింది అవినీతి పరులేనని..దీని వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం జరిగేది లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత్‌రావు అన్నారు. శుక్రవారం బాలానగర్ మండల కేంద్రంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వి.హనుమంత్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని, వీడిన వారందరు అవినీతి పరులేనని అన్నారు. రెండు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూ చెబుతున్నాయే తప్పా ఎలాంటి పురోగతి సాధించలేదని ఆరోపించారు. రాజీవ్‌గాంధీ హయాంలోనే సైన్స్, టెక్నాలజీని అభివృద్ది చేయడంతో పాటు 18సంవత్సరాలకు ఓటు హక్కు చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జై జవాన్-జై కిసాన్ లాంటి పథకాన్ని ప్రవేశపెడితే వాజ్‌పాయ్ లాంటి గొప్ప నాయకులు ఎంతో అభినందించారని వివరించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థులను ప్రోత్సహిస్తూ రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల కోసం ప్రభుత్వం 150కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మూడవ విడతలో రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి మాట్లాడుతూ స్వార్ద రాజకీయాలకు పాల్పడుతున్న వ్యక్తులకు ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. రైతులకు క్రాప్ లోన్లు వెంటనే మంజూరు చేసే విధంగా ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టిపిసిసి నేత గొల్లు కిషన్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, శంకర్‌నాయక్, బిచ్యునాయక్, మధు, రాములు పాల్గొన్నారు.