మహబూబ్‌నగర్

బంగారు తెలంగాణ సాధనకు పారిశ్రామికవేత్తలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 17: బంగారు తెలంగాణ సాధనలో పారిశ్రామికవేత్తలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి కోరారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో లక్షల సంఖ్యల్లో మొక్కలు నాటి జిల్లాను హరితమయం చేయాలన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి టి ఐపాస్ అనుమతులు, రాయితీలకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, హరితహారం కార్యక్రమంపై, కార్యచరణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా పరిశ్రమలకు అనుకూలంగా ఉందని జిల్లా అక్షరాస్యతలో తక్కువగా ఉండడం బడి ఈడు పిల్లలు బడిలో కాకుండా బయట ఉండడం వంటి కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకుని జిల్లా అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పర్యావరణ సంరక్షణ, అక్షరాస్యత పెంపుపై ఎక్కువ దృష్టి కేం6దికరించాలని కోరారు. అలాగే మాత, శిశు మరణాల సంఖ్యను తగ్గించడంలో సహకారం అందించాలని ఇందుకుగాను పిల్లలు పాఠశాలలో చేరేకంటే ముందు చేపట్టే కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఐదు కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యచరణ రూపొందించడం జరిగిందని ఇందుకు గాను 562 నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టామని, పారిశ్రామిక వాడలు, స్థలాలు, సంస్థల్లో లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
మొక్కలను తీసుకెళ్లడం, నాడడంతో పాటు వాటి సంరక్షణలో బాగస్వామ్యం కావాలని చెప్పారు. మొక్కలను నాటే ముందుగా గుంతలను సిద్దం చేసుకోవాలని పరిశ్రమలతో పాటు గ్రామాలు, రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చినట్లు అయితే మొక్కలు సరఫరా చేస్తామని తెలిపారు. పరిశ్రమల ద్వారా నాటే మొక్కలకు సంబందించి కార్యచరణ ప్రణాళిక సమర్పించాలని కోరారు. జడ్పి సిఇఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా పారిశ్రామిక యజమానులు, కార్పోరేట్ భాద్యత కింద గ్రామాలు సంస్థలను దత్తతగా తీసుకుని మొక్కలు నాటాలని కోరారు. ఒక్కోక్క పరిశ్రమలో ఎన్ని మొక్కలు నాటేది ప్రణాళికలను ఆయన సేకరించారు. చిన్న తరహా పరిశ్రమల వారికి మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. వర్షం వచ్చేనాటికి గుంతలు సిద్దం చేసుకోవాలని, మొక్కలను సంరక్షించడానికి ప్రతి పరిశ్రమ ఒకరిని బాద్యునిగా నియమించాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ రవీందర్, డిఎఫ్‌ఓ రాంమూర్తి పాల్గొన్నారు.