మహబూబ్‌నగర్

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టిడిపి నేతల కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, జూన్ 17: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలతో బీడు భూములకు సాగునీరు అందించే దశలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పని చేస్తుండగా కాంగ్రెస్, టిడిపి నేతలు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం ధన్వాడ మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన ఎస్టీ గురుకుల పాఠశాల పనులకు రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం ప్రజలను ఉద్ధేశించి మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాలమూరు జిల్లాను సాగునీరు, తాగునీరుతో సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని కాంగ్రెస్, టిడిపిలు అడ్డుకట్ట వేసేందుకు కుట్రలు చేయడం సిగ్గుచేట్టన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగా ప్రభుత్వం 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పక్కనే కృష్ణానది ఉండగా ప్రజలకు సాగు, తాగునీరు కూడా గత ప్రభుత్వాలు అందించలేకపోవడం విడ్డురంగా ఉందన్నారు. ధన్వాడ మండంలోని కొండాపూర్ గ్రామానికి చుట్టూ పక్కన ఉన్న గిరిజనుల వైద్యసేవలు అందించేందుకు నూతనంగా పిహెచ్‌సి మంజూరుకు కృషి చేస్తానని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సభలో హమీ ఇచ్చారు. అదేవిధంగా ధన్వాడ మండల కేంద్రంలోని పిహెచ్‌సిలో అదనంగా మరో డాక్టర్ పోస్టుకు, అదేవిధంగా సిబ్బంది ఏర్పాటుకై తన వంతు కృషి చేస్తానని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా ధన్వాడ మండలంలోని కోండాపూర్ గ్రామంలో గ్రామసర్పంచ్ గౌనిశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంను మంత్రి లక్ష్మారెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేంధర్‌రెడ్డిలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మఖ్తల్ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, నారాయణపేట ఆర్డిఓ శ్రీనివాస్, ధన్వాడ మండల ఎంపిపి శశికళ, జడ్పిటిసి కవిత, కొండాపూర్ గ్రామసర్పంచ్ శేఖర్‌రెడ్డి, ఎంపిటిసి భీంరెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు వై.వెంకట్రామరెడ్డి, బుచ్చప్ప, సంపత్‌కుమార్, అశోక్‌కుమార్, మురళిధర్‌రెడ్డి పాల్గొన్నారు.