మహబూబ్‌నగర్

కృష్ణానది వంతెనపై 21 నుండి రాకపోకలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జూన్ 17: తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో అప్పటి నిజాం కాలంనాడు నిర్మించిన కృష్ణానది వంతెన పనులకు కర్ణాటక ప్రభుత్వం మరమ్మతు పనులు చేపడుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు వంతెన కింది భాగంలో పనులు పూర్తికావస్తున్నాయి. ప్రస్తుతం వంతెనపై అప్పట్లో సిసి రోడ్డుపై బిటి రోడ్డు వేయడంతో రోడ్డు మొత్తం పూర్తిగా గుంతల మయంతో అధ్వాన్నంగా మారింది. ఈనెల 21 నుండి వచ్చేనెల జూలై 30 వరకు 40 రోజులపాటు చేపట్టే వంతెన పనులలో భాగంగా వంతెనపై రాకపోకలను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు లిఖిత పూర్వకంగా నోటిఫికేషన్ అందచేనట్లు కృష్ణా పోలీసులు తెలియచేస్తున్నారు. హైదరాబాద్ నుండి కర్ణాటకవైపు, కర్ణాటక నుండి హైదరాబాద్‌వపై వెళ్ళే వాహనాలన్ని మరికల్, ఆత్మకూర్, గద్వాల మీదుగా రాయిచూర్‌కు, లేదా హైదరాబాద్ నుండి మహబూబ్‌నగర్ గద్వాల మీదుగా రాయిచూర్‌కు వెళ్లే విదంగా దారి మళ్లించినట్లు పోలీసు శాఖవారు తెలియచేశారు. కొన్ని వాహనాలు రాయిచూర్, గద్వాల మీదుగా జడ్చర్ల హైదరాబాదుకు వెళ్లేవిదంగా సూచించారు. అలాగే రాయిచూర్ నుండి యాద్గీర్ వైపు వెళ్లే వాహనాలు కల్మాల మీదుగా దేవదుర్గ హట్టిగూడూరుపై యాద్గీర్ వెళ్లేవిందగా సూచించినట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలోని రైతులు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వంతెన నిర్మాణ కాలం 40 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిస్తే కృష్ణమ్మ పొంగి పొర్లే అవకాశాలు లేకపోలేదు. రైతులు ధాన్యపు విక్రయానికి గానీ, వైద్య పరీక్షలకు వెళ్లే రోగులకు సైతం అనేక ఇబ్బందులు తటస్తించక తప్పదు. ముఖ్యంగా రోడ్డు నిర్మాణంలో ఎలాంటి ప్రత్యామ్నయ ప్రయత్నాలు చేయలేక పోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి వంతెనపై పకడ్బందిగా సిసి రోడ్డు నిర్మాణాలు చేపడుతుండటంతో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందరు సహకరిస్తే తప్ప పనులు త్వరితగతిన వేగవంతంగా జూలై 30 నాటికి పూర్తవుతాయి, లేని పక్షంలో ఆగస్టు 12 ప్రారంభమయ్యే పుష్కరాలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వంతెన పనుల నిర్మాణం పూర్తి అయినప్పటికి వాటిని నీటితో నాణ్యతగా క్యూరింగ్ చేస్తే తప్పా రోడ్డులో గట్టితనం ఉంటుంది. లేని పక్షంలో మూన్నాళ్ల ముచ్చటగా మళ్లీ గుంతల మయమే అవుతుందని ప్రయాణికులు అంటున్నారు.