మహబూబ్‌నగర్

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 17: ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సద్భావన యాత్ర, ఉగ్రవాద వ్యతిరేక యాత్ర సందర్భంగా రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం అశోక్ టాకీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలేందరో ప్రాణాలు వదిలారని, కాగా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలను టెర్రరిస్టులు కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్రమోడీ రెండేళ్ల పాలన ప్రకటనలకే సరిపోయిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన విచిత్రంగా ఉందని అన్నారు. రాష్ట్రాన్ని మధ్యం రాష్ట్రంగా తయారు చేసి ప్రజలను తాగుబోతులుగా తయారు చేసి బంగారు తెలంగాణకు బదులు తాగుబోతు తెలంగాణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వ్యవస్థను ముఖ్యమంత్రి కెసి ఆర్ ఖతం చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను కెసిఆర్ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అయితే పార్లమెంట్‌లో 2013లో తీసుకువచ్చిన భూసేకరణ చట్టం ద్వారానే భూములను తీసుకోవాలని హనుమంతరావు డిమాండ్ చేశారు. 123 జిఓ తెచ్చి ఆ జిఓను దళారులు, పోలీసుల చేతుల్లో పెట్టి రైతులను హింసించి బలవంతంగా భూములను లాక్కొంటున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కూలగొట్టడానికి ప్రయత్నించిందని, కుట్రలు చేసిందన్న కెసి ఆర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. 2019లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేశారని కెసిఆర్ చెప్పడం హస్యాస్పదమన్నారు. మాజీ మంత్రి డికె అరుణ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశంలో తీసుకువచ్చిన సంస్కరణలు, టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని, 72,73 రాజ్యాంగ సవరణ తెచ్చి గ్రామ పంచాయతీలను పటిష్టం చేసిన మహానీయులన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, రాజీవ్‌గాంధీ మరణం దేశానికి తీరని లోటని ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, మాజీ ఎంపి మల్లురవి, నేతలు ప్రకాష్, రంగారావు, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, వెంకటేష్, వినోద్, మణెమ్మ పాల్గొన్నారు.