మహబూబ్‌నగర్

చట్ట ప్రకారమే పరిహారం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, జూన్ 17: రైతులకు పరిపూర్ణ న్యాయం జరగాలనే ఉద్దేశంతో యూపిఎ హయాంలో పార్లమెంట్‌లో చర్చించి తీసుకొచ్చిన చట్ట ప్రకారమే భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే రైతుల పక్షాన భూ పోరాటానికి సన్నద్ధం అవుతామని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రానికి వెళ్తూ.. మార్గమధ్యంలోని జడ్చర్ల ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో విహెచ్ మాట్లాడారు. భూ నిర్వాసితులకు పరిహారం కోసం చేసిన 123జీవోను హైకోర్టు సైతం తప్పు పట్టిందని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తేనే నష్ట పరిహారం చెల్లించాలని పేర్కొందని ఆయన వివరించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ల పేరిట రైతుల నుంచి భూములను అతి తక్కువ ధరకు బలవంతంగా తీసుకొని అందులో కేవలం 20 శాతం మాత్రమే పరిశ్రమలకు కేటాయించి 80 శాతం భూములను రైతుల కళ్లెదుటే ఎకరా భూమికి కోట్లలో అమ్ముతుంటే రైతులు కాంగ్రెస్‌కు దూరం అవుతారని తమ అధినేత్రి దృష్టికితీసుకెళ్తే రైతులకు సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతులకు ఆచట్ట ప్రకారమే పరిహారం ఇవ్వాల్సి ఉండగా టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తన ఇష్టానుసారం బిల్లులను తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తామంటే సహించేది లేదన్నారు. 2013లో చేసిన ఈ చట్టం ప్రకారం భూములు పోగొట్టుకున్న రైతులకు నష్ట పరిహారం అర్బన్ ప్రాంతంలో రెండు రెట్లు, రూరల్ ప్రాంతాల్లో మూడు రెట్లు, ఎస్సీ, ఎస్టీలకు నాలుగు రెట్లు నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉండగా ముఖ్యమంత్రి అందుకు విరుద్ద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దళారీలను ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తుందన్నారు. ప్రాజెక్టుల పేరిట రైతుల పక్షాన నిలిచేందుకు ప్రత్యేకంగా దామోదర రాజ నర్సింహ చైర్మన్‌గా పిసిసి కమిటీ ఎర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయకపోతే జడ్చర్ల కేంద్రంగా పెద్దఎత్తున ఆందోళన చేపడ్తామని మాజీ ఎమ్మెల్యే మల్లు రవి తెలిపారు.