మహబూబ్‌నగర్

రైతు సంక్షేమంతోనే బంగారు తెలంగాణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జూన్ 17: రైతు సంక్షేమంతోనే బంగారు తెలంగాణ సాద్యమని,నాబార్డు రుణాలతో మానవశైలిలో మార్పు చెందాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని సింగిల్‌విండో కార్యాలయం ఆధ్వర్యంలో చిన్న, సన్న కారు రైతులకు విత్తనాల పంపిణి కార్యాలయంతో పాటు కార్యాలయంలో ఇంకుడు గుంతను చైర్మన్ భూపాల్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని న్యూ ఎరా జూనియర్ కళాశాల అవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష, 12 సంవత్సరాల కళ బంగారు తెలంగాణ అని,బంగారు తెలంగాణ రైతు సంక్షేమంతోనే సాద్యమని, నాబార్డు నుండి కల్వకుర్తి సింగిల్‌విండో శాఖకు మంజూరైనా రూ.90 లక్షల రుణాలతో మానవశైలిలో మార్పు చెందాలని, వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు.
అదేవిధంగా మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన చిన్న, సన్న కారు రైతులకు డిసిసిబి బ్యాంక్ రాష్ట్ర సిఇఓ వెంకటస్వామితో రుణాల చెక్కులను అందించారు. అలాగే డిసిసిబి రాష్ట్ర అధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణాలు అందించడంలో డిసిసిబి రాష్ట్రంలోనే ముందజలో ఉందని, గత సంవత్సరం 50 కోట్ల రూపాయాలను రైతులకు రుణాలు అందించడం జరిగిందని ప్రస్తుత సంవత్సరం 75 కోట్ల రుణాలను అందించేందుకు సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిపి రామేశ్వరమ్మ, జడ్పీటిసి అశోక్‌రెడ్డి, నగర పంచాయితీ చైర్మన్ శ్రీశైలం, సింగిల్ విండో వైస్ చైర్మన్ జనార్థన్‌రెడ్డి, డైరెక్టర్స్ సుదాకర్‌రెడ్డి, ఇందిరమ్మ, పవన్‌కుమార్‌రెడ్డి, కల్వకుర్తి డిసిసిబి కల్వకుర్తి శాఖ సిఇఓ వెంకట్‌రెడ్డి, బ్యాంక్ మేనేజర్ రమేష్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బాలాజీ సింగ్, నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు.