మహబూబ్‌నగర్

కెసిఆర్ దౌర్జన్యానికి భయపడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 2: ముఖ్యమంత్రి కెసిఆర్ దౌర్జన్యానికి దిగుతున్నాడని ఆయన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని భయం పట్టుకుందని అందుకే టిఆర్‌ఎస్ చిల్లరగాళ్లతో దౌర్జన్యాలు చేయిస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ నాయకులు చేసిన హల్‌చల్‌కు నాగం స్పందిస్తూ ముఖ్యమంత్రి దౌర్జన్యాలకు భయపడనని, ఆయన తింటున్నటువంటి అవినీతి డబ్బును కక్కించేందుకే రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్యంగా కోర్టుకు వెళ్లాలనన్నారు. తెలంగాణ రజాకారుల సంఘంగా ఉన్న టిఆర్‌ఎస్ నాయకులు చిల్లర వేషాలు వేస్తూ అవినీతిని ప్రశ్నించేవారిపై దాడులకు పాల్పడడం దుర్మర్గమైన చర్య అన్నారు. తాను మాత్రం ముఖ్యమంత్రికి గానీ, టిఆర్‌ఎస్ చిల్లర నాయకులకు భయపడనని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై తన పోరాటం అగదని ఏడాది తర్వాత ఎవరు నిజాయితీపరులో తెలిపోతుందని టిఆర్‌ఎస్ అల్లాటప్పా పార్టీ అని బిజెపి బలమైన పార్టీ అని టిఆర్‌ఎస్ నాయకులు మరచిపోవద్దని బిజెపి నాయకులు, కార్యకర్తలు తిరగబడితే రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గ్రామాలకు రారని వారి పర్యటనలు అర్థంతరంగా ముగించుకుని ఇళ్లల్లో కూర్చోవల్సి వస్తుందని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ముర్ఖులు ఓ సారి ఆలోచించుకోవాలని తాను పాలమూరు ఎత్తిపోతల పథకం మొత్తానికి కోర్టుకు వెళ్లినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో 18 ప్యాకేజిల పనులు ఉంటే కేవలం నాలుగు ప్యాకేజిలపై కోర్టుకు వెళ్లానని 1,5, 8, 16 ప్యాకేజీల పైనే అవినీతి జరిగిందని కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. దేశంలో కోర్టును ఆశ్రయించడం తప్పు ఎలా అవుతుందని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా భారతీయ పౌరుడిగా, మాజీ మంత్రిగా తన భాద్యత అని చెప్పారు. అసలు కోర్టుకు వెళ్తే ద్రోహం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతి వెంట ముందుపడుతానని మరో ఆరు నెలల తర్వాత మిషన్ భగీరథలో జరిగిన దాదాపు రూ.30వేలకోట్ల అవినీతిని బయటకు తీస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రశ్నించేవారి గొంతునొక్కుతూ రజకారుల తరహాలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన సాగిస్తున్నారని, అవినీతిపై పోరాటం తప్పదని నాగం స్పష్టం చేశారు.

అవినీతిని ఎండగడితే దాడులా?
కొడంగల్, జూలై 2: అవినీతిని ఎండగడితే దాడులు చేస్తారా అని బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్ అన్నారు. శనివారం బిజెపి నేత నాగం నార్థన్‌రెడ్డిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. ఈ సందర్భంగా మధన్ మాట్లాడుతూ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి చోటు చేసుకుందన్నారు. ఉన్న వాస్తవాన్ని బయటపెడితే దాడి చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాము కూడా ఎదురుదాడులు చేయకతప్పదని హెచ్చరించారు. ప్రధానీ నరేంద్రమోదీ ఎన్నో పథకాలను ప్రవేశపెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. పంట నష్టపోయే రైతులకు త్వరలోనే పూర్తి నష్టపరిహారాన్ని ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ సెల్ కన్వీనర్ బస్వరాజ్, నాయకులు కరెంట్ రాములు, భాస్కర్, కిష్టయ్య, బందెప్ప తదితరులు ఉన్నారు.

రిజర్వేషన్ల సాధనకు
అలుపెరగని పోరాటం
జడ్చర్ల, జూలై 2: యావత్తు మాదిగ ప్రజల ఎకైక ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సాధన కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ఇన్‌చార్జి టైగర్ జంగయ్య మాదిగ తెలిపారు. గత ఇరువై రెండు సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ చేస్తున్న కృషి నేడు చివరి దశలో ఉందని సమాజంలోని అన్ని అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రతి మాదిగ కులస్థుడు విజయవంతం చేయడంలో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం మందకృష్ణ నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో ప్రతిష్టించిన బాబు జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వస్తున్నారని అందువల్ల బాధిత కులస్థులు అధిక సంఖ్యలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఆగస్టు నాటికి 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు
బిజినేపల్లి, జూలై 2: ఈ ఆగస్టు 15నాటికి ఎంజికెఎల్‌ఐ ద్వారా 1.70లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం కెఎల్‌ఐలోని 29వ ప్యాకేజి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కెఎల్‌ఐ మొదటి లిప్టు ద్వారా కేవలం 13వేల ఎకరాలకే సాగునీరు అందిందని, గత ప్రభుత్వం 50శాతం పనులను మాత్రమే పూర్తి చేసిందని తెలిపారు. 2,3 లిప్టుల ద్వారా ఈ ఖరీఫ్‌లో లక్షా 70వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి నాలుగు లక్షల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీరు అందించాలని మంత్రి హరీష్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. కెఎల్‌ఐలోని 2,3 లిప్టులకు 150 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, విద్యుత్ శాఖ ద్వారా క్లియరెన్స్ లభించిదన్నారు.
సమావేశంలో సిఇ ఖగేందర్, ఎస్‌ఇ భద్రయ్య, టిఆర్‌ఎస్ నాయకులు గంగనమోని కుర్మయ్య, మధుకాన్ ప్రాజెక్టు మెనేజర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

న్యాయవాదుల ఆందోళన తీవ్రతరం
*కోర్టు ముందు ధర్నా
జడ్చర్ల, జూలై 2: ప్రత్యేక హైకోర్టు ఎర్పాటు డిమాండ్‌తో జడ్చర్ల న్యాయవాదులు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రధేశ్ హైకోర్టులో న్యాయ మూర్తులకు, న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయాలకు నిరసిస్తూ న్యాయవాదులు పలు విధాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. యావత్తు తెలంగాణ న్యాయవాదులు, న్యాయ మూర్తులు ప్రత్యేక హైకోర్టు ఎర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తూ తెలంగాణ హైకోరు ఎర్పాటు కాకపోవడం పట్ల న్యాయ వాదులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతున్నా ప్రత్యేక కోర్టు ఎర్పాటు చేయక పోవడంలోని ఆంతర్యం ఎమిటో తెలియక న్యాయవాదులు సతమతవుతున్నారు. అంతేకాక తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఎర్పాటు కోసం మద్దతు తెలుపుతుండగా న్యాయశాఖకే తమ తీర్పులతో వనే్న తెస్తున్న న్యాయ మూర్తులను సస్పెండ్ చేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలలో ప్రారంభించిన ఉద్యమాన్ని జడ్చర్ల న్యాయవాదులు ఉదృతం చేస్తున్నారు. న్యాయ వాదుల సంఘం రాష్ట్ర, జిల్లా శాఖల పిలుపు మేరకు జడ్చర్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అడ్వకెట్ జెఎసి కన్వీనర్ జంగయ్య, న్యాయవాదులు కరీం, మురళి, తిరుపతి, ఇఫ్తేకారోద్దీన్, కోర్టు సిబ్బంది తదితరులు ఆందోళన కార్యక్రమాలు ప్రణాళికబద్దంగా నిర్వహిస్తున్నారు.

ప్రాజెక్టుల అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా?

* బిజెపి మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి
పెద్దకొత్తపల్లి, జూలై 2: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన బిజెపి నాయకులు జనార్ధన్‌రెడ్డిపైన పాలమూరులో టిఆర్‌ఎస్ కార్యకర్తలతో దాడి చేయించడం హేయమైన చర్య అని బిజెపి మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి అన్నారు. శనివారం పెద్దకొత్తపల్లి నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాలన్నీ అతలాకుతలమయ్యాయని, అప్పుడు ప్రవేశపెట్టిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకోవడం సమంజసంకాదన్నారు. 2019లోగా ప్రతి ఇంటికి వంటగ్యాస్ అందించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత 21వేల కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిపించడం జరిగిందని, 2019 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆడపిల్లల సంరక్షణకోసం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని అమలుపర్చటంతో ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు రామన్‌గౌడ్, శేఖర్‌గౌడ్, బుచ్చన్న, శివుడు, రాజు తదితరులు పాల్గొన్నారు.