మహబూబ్‌నగర్

ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, జూలై 22: ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం తయారైందని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మండిపడ్డారు. గద్వాల జిల్లా సాధన కోసం చేపట్టిన పాదయాత్ర నాల్గవ రోజు శుక్రవారం ఉండవెల్లి నుంచి బూడ్దిపాడు వరకు కొనసాగింది. ముందుగా వైష్ణవి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పాదయాత్రను కొనసాగించారు. అనంతరం ఉండవెల్లి గ్రామంలోని నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం బూడ్దిపాడు ఆర్డీఎస్ క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయని తెలయని జిల్లా మంత్రులు కూడ ఉన్నారంటే ఎంత విడ్డూరమో తెలుసుకోవాలన్నారు. ఆకర్షణ పథకాలతో రెండేళ్ల పాలన పూర్తిచేసిన ఘనత కూడ టిఆర్‌ఎస్‌కే దక్కుతుందని ఆమె ఎద్దేవచేశారు. నడిగడ్డ ప్రాంతంలోని రెండు జీవ నదుల ద్వారా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి పేరొచ్చిన విషయాన్ని మరవకూడదని హెచ్చరించారు. గద్వాల జిల్లాకు అనువైన ప్రదేశం అయినప్పటికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాలయాపన చేయడం కరెక్ట్ కాదని హెచ్చరించారు. ప్రభుత్వపరంగా కాకుండా ప్రజలకు అనుకూలంగా జిల్లాల ప్రక్రియను చేయాలని ఆమె కోరారు. ఎలాంటి వసతులు లేని ప్రాంతాల్లో జిల్లాల ఏర్పాటును చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. అలంపూర్, గద్వాల తాలుకాకు అనువైన ప్రదేశం గద్వాల అయినప్పటికి వనపర్తి జిల్లా పేరు రావడం కరెక్ట్‌కాదని ఆమె తప్పుబట్టారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయాలతో జిల్లాల ఏర్పాటు చేయాలని సూచించారు. బూడ్దిపాడు క్యాంప్ కార్యాలయంకు చేరుకున్న ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్‌లకు పూలమాలలతో సత్కరించారు. గ్రామగ్రామాన పాదయాత్రకు పెద్దఎత్తున ప్రజాసంఘాలు, విద్యార్థులు, ప్రజలు నీరాజనాలు పలికారు. అనంతరం ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలంపూర్ తాలుకాలో సమస్యలను గాలికొదిలేసి రాజకీయ నాయకులకు అనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేయడం సరైందికాదని హెచ్చరించారు. అలంపూర్ జోగుళాంబదేవి పేరుమీద గద్వాలను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, కాంగ్రెస్ నాయకులు గడ్డంకృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, వైస్ ఎంపిపి సుధాకర్‌రెడ్డి, ఎంపిపి జయమ్మప్రకాష్‌గౌడ్, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.