మహబూబ్‌నగర్

రాకెట్ స్పీడ్‌తో ‘పాలమూరు’ పూర్తి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జూలై 22: ఆంధ్ర నాయకులు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీం కోర్టులో కేసు వేస్తే కేసు పాలమూరుకు అనుకులంగా వచ్చిందని రాకేట్ స్పీడుతో పాలమూరు ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని భీమా లిఫ్ట్-2 టన్నల్ 1 వద్ద మోటార్లను రన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూరాలకు వచ్చే కృష్ణ నీళ్లు మొట్టమొదటిగా మహబూబ్‌నగర్ వాసులకే చెందుతుందని, వచ్చిన ప్రతి నీటిని కాల్వలు, చెరువులను నుంపుకోవాలని నియోజకవర్గంలో ఉండే భీమా, కోయిల్‌సాగర్ ఎడమ కాల్వ ద్వారా చెరువులను నింపుకొని రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. గత ప్రభుత్వాలు జూరాల నిండి వృధాగా నీరు పోయేదని దీంతో తెలంగాణ ప్రాంతం రైతులకు నీరందక వలసలు వెళ్లెవారన్నారు. ఇకనుండి అధికారులను ఒత్తిడి పెట్టి జూరాల నుండి రామన్‌పాడుకు నీటిని నింపి శంకర్ సముద్రాన్ని నింపుతామన్నారు. ఇవే కాకుండా మరో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. గత ఏడాది కొత్తకోట, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో నీళ్లను అందించామని, ఆంద్ర పాలకుల వల్లే ఆత్మహత్యలు, వలసలు పెరిగాయన్నారు. అంతక ముందు రామన్‌పాడు ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో నీరు ఎంత నిల్వ ఉందో ఇ ఇ ఉమాపతి రావును అడిగి తెలుసుకున్నారు. జూరాల నుండి 1500 క్యూసెక్యుల నీరు సమాంతర కాల్వ ద్వారా విడుదల అవుతుందని వెంటనే తిరుమలయపల్లి వద్ద మొదటి మోటార్ రన్ చేసి, మరో మోటార్‌ను 24గంటల్లో రన్ చేయాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి కానాయపల్లి శంకర్ సముద్రం వద్ద రింగ్ బండను పరిశీలించారు. ఈ సమావేశంలో ఎంపిపి గుంత వౌనిక, సర్పంచు చెన్నకేశవ రెడ్డి, నారాయణ రెడ్డి, నాయకులు వెంకట్ నారాయణ, కృష్ణయ్య, ప్రశాంత్, రవీందర్ రెడ్డి, బాబురెడ్డి, బాలకృష్ణ, జగదీష్, పాష, వడ్డెరాము, సంజీవులు, వాసిరెడ్డి, కటికె శ్రీను, జగన్ పాల్గొన్నారు.