మహబూబ్‌నగర్

పుష్కర ఘాట్లకు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 22: కృష్ణా పుష్కరాల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది. అందులో బాగంగా శుక్రవారం జిల్లా యంత్రాంగం కృష్ణా పుష్కరాల ఘాట్లవైపు యాత్రతో బయలుదేరారు. అదేవిధంగా మంత్రులు సైతం పుష్కరాల పనులపై దృష్టిపెట్టి కృష్ణానది తీరాన పర్యటించారు. అన్ని పుష్కర ఘాట్ల వద్ద వాహనాల పార్కింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి పుష్కర ఘాట్ వద్ద పూజలు నిర్వహించేందుకు, పిండ ప్రధానాలు చేసేందుకుగాను ముందుగానే పూజారులను గుర్తించి ఘాట్ వారిగా జాబితా తయారు చేయాలని కూడా తెలిపారు. ప్రస్తుతం రెండు మూడు రోజుల పాటు జిల్లా అధికార యంత్రాంగం పుష్కరాల పనులు జరుగుతున్న తీరుపై పర్యవేక్షించనున్నారు. జిల్లా అధికారుల బృందం, మంత్రులు ముందుగా పస్పుల పుష్కర ఘాట్‌ను సందర్శించారు. తాత్కలిక మరుగుదొడ్లతో పాటు కొత్త, పాత పుష్కర ఘాట్లను పరిశీలించి రెండు వైపుల ప్యారాపెట్‌వాల్‌ను నిర్మించాలని సంబందిత ఇ ఇని ఆదేశించారు. జూరాల పుష్కర ఘాట్లతో పాటు నెట్టెంపాడు పుష్కర ఘాట్లు, బీచుపల్లి పుష్కర ఘాట్లను కలెక్టర్ బృందం పరిశీలించారు. జిల్లా అధికార యంత్రాంగం అటువైపు వెళ్లడంతో అందరి దృష్టి పుష్కర ఘాట్లపై పడింది. నాలుగు రోజుల్లో పార్కింగ్ స్థలాలన్నింటిని ప్రభుత్వ అధినంలోకి తీసుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు సూచించారు. శనివారం రోజు కూడా జిల్లాలోని మిగితా ఘాట్లను పరిశీలించేందుకు అధికార బృందం సమయత్తం అయ్యింది. పుష్కర ఘాట్ల పనులపైనే ప్రత్యేక దృష్టి కేంద్రికరించారు.