మహబూబ్‌నగర్

నాటి ప్రాజెక్టులకే నేడు ప్రారంభోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూలై 22: గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులనే నేడు టిఆర్‌ఎస్ మంత్రులు ప్రారంభిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి విమర్శించారు. శుక్రవారం బాలానగర్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కొయిల్‌సాగర్ ప్రాజెక్టులను మొదలుపెట్టి ప్రజలకు నీరు అందించడం జరిగిందని, అయితే నేడు టిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆయా ప్రాజెక్టులకు కొత్త పేర్లు పెడుతూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కంటే నేడు ప్రజలకు ఎక్కువగా లబ్ధి కూడా లభించడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై నేటి టిఆర్‌ఎస్ పాలకులు విమర్శలు చేయడం మానుకోవాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందడం జరిగిందని, ప్రాజెక్టులను సైతం మొదలుపెట్టి పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. దీనికితోడు నేడు టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పాలమూరు జిల్లాను అభివృద్ధి పర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అభివృద్ధి పర్చాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహిస్తే తప్పా పాలకులు కళ్లు తెరవడం లేదంటూ అన్నారు. ఇప్పటికైనా టిఆర్‌ఎస్ పాలకులు జరిగిన అభివృద్దిని గుర్తించాలని అలా కాకుండా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నందీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.