మహబూబ్‌నగర్

మహాపాదయాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జూలై 22: జిల్లాలో పూర్తిగా వెనుకబడిన మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరందించే జిఓ.నెం 69 ప్రకారం వెంటనే నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల జలసాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మక్తల్ మండల పరిధిలోని భూత్పూర్ రిజర్వాయర్ నుండి చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలో అన్ని రకాల పంటలు పండే భూములున్నప్పటికి సాగునీరులేక బీళ్లుగా మరుతున్నాయని అన్నారు. ఈప్రాంతానికి సాగునీరు, తాగునీటి కోసం పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం 2014లో జిఓ నెం 69 ద్వారా నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిందని అన్నారు. గత ప్రభుత్వం రూ.1450 కోట్లతో ఈపథకాన్ని చేపట్టడానికి ఉత్తర్వులు జారిచేసిందన్నారు. ప్రాథమిక సర్వేకోసం రూ.3కోట్లు, భూసేకరణ కోసం రూ.130 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. సర్వేకూడా పూర్తి కాగా మూడు నియోజకవర్గంలోని 10 మండలాలల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తూ 5లక్షల 50వేల జనాభకు తాగునీరు అందించడం ఈపథకం ఉద్దేశ్యమన్నారు. కృష్ణా నికర జలాల నుండి 7టిఎంసిల నీటిని భీమా ఫేజ్-1 నుండి నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతలకు తీసుకోవలసిందన్నారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాల బ్యాక్ వాటర్ నుండి నీటిని తీసుకోకుండా 200 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నీటిని తీసుకురావాలని ఆలోచించడం కేవలం దోచుకోవడానికేనని వారు ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్ష మేరకు జూరాల బ్యాక్ వాటర్ నుండి నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీటిని అందించాలని వారు డిమాండ్ చేశారు. కెసిఆర్ ఒంటెద్దు పోకడాలవల్ల నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కోసం పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి మూడు నియోజకవర్గాలకు సాగునీటిని అందించినప్పుడే బంగారు తెలంగాణ ఏర్పడినట్లు అని అన్నారు. జలసాధన సమితి అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదికపైకి తీసుకొచ్చి మహాపాదయాత్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సాధించే వరకు తామంత ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. వీరితోపాటు బిజెపి జాతీయ నేత నాగం జనార్ధన్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినని వీరభద్రం సిపిఐ రాష్ట్ర నాయకులు గంటా మల్లేష్, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి, నాగురావునామాజీ, రతంగ్‌పాండురెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రంగారావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జలసాధన సమితి కన్వీనర్ అనంత్‌రెడ్డి, నర్సిములు, కొండయ్య, నింగిరెడ్డి, కోత్వాల్, నిజాంపాష, శ్రీహరి, షరాప్‌కృష్ణ, రవిందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, హనే్మష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ కేంద్రమంత్రి జైపారెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.