మహబూబ్‌నగర్

గద్వాలకు అర్హత లేదని కెసిఆర్ పుష్కర స్నానం చేసి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, జూలై 22: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.16,500కోట్ల మిగులు బడ్జెట్ మిగిలించిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో ఉందని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్‌లు అన్నారు. గద్వాల జిల్లా సాధనకై జములమ్మ నుంచి జోగుళాంబదేవి ఆలయం వరకు చేస్తున్న పాదయాత్ర 4వ రోజు శుక్రవారం అలంపూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్‌లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నడిగడ్డ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడతాయని ఆశించినా అడియాశలుగానే మిగిలియాని తెలిపారు. 80వేల పుస్తకాలు చదివిన కెసిఆర్‌కు అలంపూర్ జోగుళాంబ, గద్వాల సంస్థానం, నడిగడ్డ గురించి తెలియక పోవడం విడ్డూరకరమన్నారు. నడిగడ్డ ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంట్ లేదంటే జిల్లాలోనే కాంగ్రెస్ నాయకులను తీసుకెళ్లి సోనియాగాంధీకి నడిగడ్డ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకుంటున్నారని తెలియజేసినట్లు చెప్పుకొచ్చారు. ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ అంతా నీరు పారిస్తామని ఎన్నికల్లో చెప్పుకొచ్చారన్నారు. ఆర్డీఎస్ దగ్గర కుర్చీ వేసుకొని కుర్చోని పనులు చేయిస్తానని చెప్పిన కెసిఆర్ రెండు సంవత్సరాలు గడిచినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తున్నారని, 2019లో కెసిఆర్ నీ తఢాకాను ప్రజలు చూయిస్తారని అన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న కెసిఆర్ తన ఇంటికి మాత్రమే నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని, తాను ముఖ్యమంత్రిగా, కొడుకు మంత్రిగా, కూతురు ఎంపిగా, అల్లుడు మంత్రిగా ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తేనే ఆ నాడు స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. ప్రజల కొరకు మేము పాదయాత్ర చేస్తే రాజకీయం చేస్తున్నారని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. హరితహారం పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారన్నారు. నడిగడ్డ గద్వాల జోగుళాంబ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని తహశీల్దార్ల నుంచి ముఖ్యమంత్రి వరకు వినతిపత్రాలు అందజేసినా లాభం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న జిల్లాల ఏర్పాటు శాస్ర్తియ పద్దతిగా లేదన్నారు. వచ్చే కృష్ణా పుష్కరాలలో పుష్కరస్నానం ఆచరించిన తరువాత గద్వాల జిల్లా చేసేందుకు అర్హతలేదని చెబితే మేము వదిలేస్తామని ఆమె తెలిపారు. గద్వాలను జిల్లా చేయకపోతే జోగుళాంబదేవి తల్లి ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఏ ఒక్కరి స్వార్థం కోసమో జిల్లా ఏర్పాటు చేయరాదని, ప్రజల ఆకాంక్ష మేరకే జిల్లాల ఏర్పాటు జరగాలని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. ప్రజలు నిండు మనసుతో ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని, ప్రజల ఆకాంక్ష అయిన గద్వాల జిల్లా చేసే వరకు పోరాటం ఆగదని తెలిపారు. నడిగడ్డ ప్రజల రోషం, పౌరుషం కెసిఆర్‌కు తెలియదని, గద్వాల జిల్లా చేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్మన్ బండల పద్మావతి, తాలుకా ఎంపిటిసిల ఫోరం కన్వీనర్ సధానందమూర్తి, సర్పంచు కాంతారెడ్డి, నాయకులు గడ్డంకృష్ణారెడ్డి, రుక్ముద్దీన్, రామకృష్ణ, పరుశరాముడు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం శ్రీ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్‌లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.