మహబూబ్‌నగర్

అంధకారంలో అంజనగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జూలై 22: వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలో విద్యుత్ లైనుకు అంతరాయం కలిగిస్తున్నారన్న నెపంతో ఏకంగా విద్యుత్ అధికారులు ఆ గ్రామానికే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, గ్రామస్తులు డిఇ ఇంటి ముందు బైఠాయించారు. రైతులకు పగలే 9 గంటల విద్యుత్‌ను ఇవ్వాలన్న ఉద్దేశంతో అంజనగిరి గ్రామం నుండి పాన్‌గల్ మండలానికి అదనపు లైనును వేయడానికి అధికారులు విద్యత్ పోల్‌లను పాతారు. అయితే ఒడ్డు వెంట కాకుండ తమ పంటపొలాల్లో మధ్యలో లైను వేయడంవల్ల ప్రమాదాలు జరుగుతాయని, తమ పంటపొలాల్లో తమ అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారని ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. అందుకు ఆగ్రహించిన విద్యుత్ అధికారులు తమకు లైను వేయడానికి అడ్డుపడినంతకాలం గ్రామానికి విద్యుత్ ఇవ్వమని, గురువారం ఉదయం నుండి విద్యుత్ సరఫరాను నిలిపివేశారని గ్రామస్థులు ఆరోపించారు. సుమారు రెండు రోజుల నుండి గ్రామానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటికి, పశువులకు నీటికి ఇబ్బందులు తలెత్తడంతో పాటు పంటపొలాలకు నీరు పారించే పరిస్థితి లేదని రైతులు వాపోయారు. దాంతో ఆగ్రహానికి గురైన రైతులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున డిఇ ఇంటికి వెళ్లి ఇంటి ముందు బైటాయించారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి డిఇ ఇంటి వద్దకు వెళ్లి వెంటనే గ్రామానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిఇని కోరారు. రాత్రి అయినందున ఉదయం సరఫరా చేస్తామని డిఇ చెప్పగా గ్రామానికి విద్యుత్ సరఫరా చేసేంతవరకు ఇక్కడే కూర్చుంటామని రైతులు, ఎమ్మెల్యే చెప్పడంతో డిఇ క్రింది స్థాయి అధికారులకు వెంటనే విద్యుత్ సరఫరాను కొనసాగించాలని ఫోన్‌ద్వారా ఆదేశించారు. అయినప్పటికి గ్రామంలో విద్యుత్ సరఫరా వచ్చేంతవరకు ఇక్కడి నుండి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే చిన్నారెడ్డి, గ్రామస్థులు బీష్మించి కూర్చున్నారు.