మహబూబ్‌నగర్

పీర్లగుట్టను చిట్టడవిగా మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఆగస్టు4: వనపర్తి పట్టణానికి అనుకొని ఉన్న పీర్లగుట్టలో మొక్కలు నాటి వాటిని పెంచి చిట్టడవిగా మార్చాలని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి పట్టణంలోని పీర్లగుట్ట, మెట్టుపల్లి గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని మొక్కలు నాటామనేది ముఖ్యం కాదని, నాటిన ప్రతి మొక్కను పెంచాలని ఆయన సూచించారు. గతంలో పీర్లగుట్టపై చెట్లు అధికంగా ఉండేవని కాలక్రమేణా చెట్లు అంతరించుకుపోయాయని ఆయన అన్నారు. పీర్లగుట్టపై విరివిగా మొక్కలు నాటి చిట్టడవిగా మార్చే బాద్యత ఫారెస్టు అధికారులు తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కల పెంపకాన్ని జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రమేష్ గౌడ్, ఎంపిపి శంకర్ నాయక్, కౌన్సిలర్లు రమేష్ నాయక్, గట్టుయాదవ్, లోక్‌నాథ్ రెడ్డి, వాకిటి శ్రీ్ధర్, సతీష్ యాదవ్, జి.జె శ్రీనివాసులు, విష్ణుసాగర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.