మహబూబ్‌నగర్

123 జిఓ రద్దు...ప్రభుత్వానికి చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, ఆగస్టు 4: 123 జిఓ రద్దు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని రైతు ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని కల్వకుర్తి ఎమ్మెల్యే డాక్టర్ చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గురువారం ఆమనగల్లు మార్కెట్ యార్డు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేసి రైతుల నుండి భూములు కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కొత్త కొత్త జిఓల ద్వారా రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తే రైతుల పక్షాన ప్రజాపోరాటం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం ప్రేమ లేదని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని కోర్టు తీర్పు ఇచ్చేంతవరకు ప్రభుత్వం రైతులతో ఆటలు ఆడుతుందని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల కోసం భూములు సేకరించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేశారని విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. 123 జిఓను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఈ జిఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రియల్ బ్రోకర్‌గా పనిచేసిందని ఆరోపించారు. చట్టాలను ఉల్లంఘించి ఇలాంటి జిఓలు తీసుకువస్తే ప్రజా పోరాటం తప్పదన్నారు. రైతుల మేలు కోరే ప్రభుత్వం అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పెంచి రైతుల భూములు కొనుగోలు చేయాలన్నారు. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. రైతు వ్యతిరేక జిఓలు ఎన్ని వచ్చిన ఇలాంటి తీర్పులే ఎదురవుతాయని అయిన ప్రభుత్వానికి బుద్ధ్ది రావడం లేదని విమర్శించారు. దురుధ్వేశపూర్వకంగా వ్యవహరించి ఇప్పటి వరకు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఆమనగల్లు మండలంలో ఫార్మా ఫిల్మ్‌సిటీ కోరకు వేలాది ఎకరాల భూములను రైతుల నుండి లాక్కొవాలని చూస్తే వారి తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పర్యావరణానికి హాని కలిగించే ఏ చర్యనైన తాము వ్యతిరేకమని రైతు పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ కండె కళావతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధనుంజయ, నరసింహరెడ్డి, ఖలీల్, ఖాదర్, కరీమ్, మైసయ్య, కృష్ణయ్య, వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.