మహబూబ్‌నగర్

ఘాట్ల నిర్మాణంలో నాణ్యత కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో చెబుతున్నట్లుగా క్షేత్రస్థాయిలో జరుగడం లేదని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. గురువారం గద్వాల సమీపంలోని నది అగ్రహారం పుష్కరఘాట్‌ను పరిశీలించారు. గతంలో నిర్మించిన ఘాట్లను పోల్చుతూ ఇప్పుడు నిర్మించిన ఘాట్ల నాణ్యతపై పెదవి విరిచారు. కేవలం 15మీటర్ల వెడల్పు, 70 మీటర్ల పొడవుతో రూ.60కోట్లతో పుష్కరఘాట్ నిర్మిస్తుండగా పార్కింగ్ పేరిట కోటి రూపాయలు మంజూరు చేయడం వెనుక అవినీతి బహిర్గతవౌతుందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన టిఆర్‌ఎస్ నేతలు జిల్లా మంత్రులతో కలిసి పుష్కరాల పనుల్లో అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఎక్కడ చూసినా పుష్కర పనులు 60శాతం కూడ పూర్తికాలేదని, గడువు సమీపిస్తున్న కొద్ది పనులు చేసి నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నిధులు దోపిడీ చేసేందుకు పథకం పన్నారని వాపోయారు. గత ఏడాదిగా పుష్కరాల పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎన్నో సమావేశాలు నిర్వహించుకున్నారని ఇప్పటి వరకు పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వారి పేరిట పనులు దక్కించుకొని సబ్‌కాంట్రాక్టులు చేస్తూ ఇక్కడి టిఆర్‌ఎస్ నేతలు పుష్కరనిధులను భారీగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. నెట్టెంపాడు, ఉప్పేరు పుష్కరఘాట్ల పనులు 50శాతం నీటిలో మునిగిపోయాయని, అక్కడ పనులు చేసినట్లు నిధులు స్వాహా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నది అగ్రహారం వద్ద పుష్కరఘాట్లు, పిండప్రధాన ఘాటు, మరుగుదొడ్లు, తాగునీటి పథకాలు, ఆలయాల మరమ్మత్తు, రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. కేవలం నేతల జేబులు నింపుకునేందుకు పనులు చేపడుతున్నారని ఆరోపించారు. గతంలో పార్కింగ్ కోసం రెండు ఎకరాల స్థలం సేకరించగా ఇప్పుడు 70 ఎకరాలు సేకరించి కోటి రూపాయలు ఎందుకు ఖర్చు చేయాల్సి వస్తుందో అధికారులు, నాయకులు ప్రజలకు చెప్పాలన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్, నాయకులు గడ్డంకృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, రామాంజనేయులు, డిటిడిసి నర్సింహ, బంగి సుదర్శన్, బొట్టు సుధాకర్, బాలు, నాగేంధర్‌యాదవ్, భాస్కర్‌యాదవ్, పులిపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.