మహబూబ్‌నగర్

కృష్ణా నీటి వాటాలో నికర జలాల హక్కును విస్మరించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 4: కృష్ణా నీటివాటాలో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబందించి నికర జలాల హక్కును జిల్లా మంత్రులు విస్మరించొద్దని నికర జలాలు ఉన్న సంగతిని మరచిపోకూడదని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి కోరారు. గురువారం పర్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద వరినాట్లు వేయవద్దని కలెక్టర్ ఎలా చెబుతారని ఐడిబి సమావేశంలో రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు జూరాల బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోస్తుండగా వరి సాగు చేయవద్దని ఎలా చెబుతారన్నారు. 12500 ఎకరాలకు సాగునీరు అందించి తీరాల్సిందేనని ఈ ప్రాజెక్టు రైతాంగానికే నీటిలో హక్కు ఉందని ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుండి నీటిని తీసుకెళ్లాలంటే 2.74టిఎంసిల సామర్థ్యం ఉంచే నీటిని తరించాలన్నారు. ఆయకట్టు రైతులు వరిసాగు వేస్తారని ఎవరు అపుతారో చూద్దామన్నారు. రైతులు వరి సాగు చేస్తే జిల్లా యంత్రాంగం, మంత్రులు రైతులకు సాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరి సాగు చేయకుండా ఉరి వేసుకోవాలా అని ప్రశ్నించారు. ఇంకా జూరాల ప్రాజెక్టు నుండి నికర జలాల హక్కుల్లో నీటిని వాడుకునే అవకాశం ఉందని అందుకే తాము త్వరితగతిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టును నింపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని వదలాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాగాపుల్లారెడ్డి ప్రొత్సహం ఆయన సహకారంతో కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి జూరాలను పూర్తి చేసుకున్నామని అంతేకాకుండా నికర జలాలకు హక్కును పొందామన్నారు. 17.74టిఎంసిల నికర జలాలు అప్పట్లోనే జూరాలకు కేటాయింపు జరిగాయని ఈ కేటాయింపు కేవలం మహబూబ్‌నగర్ జిల్లాకే హక్కు అన్నారు. జిల్లా ప్రయోజనాలను పన్నంగా పెట్టకుండా జిల్లా ఆయకట్టు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాతనే ఇతర జిల్లాలకు నీరు అందిస్తే మంచిదని హితవు పలికారు. ప్రాజెక్టులను తాను అపమని చెప్పడం లేదని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ఓ వైపు సాగునీరు ఇవ్వడం మంచిదైనప్పటినికి నారాయణపేట, కొడంగల్, మక్తల్ ప్రాంతాలకు 69 జిఓ ద్వారా వచ్చిన ప్రాజెక్టును నిర్మిస్తే ఖర్చుతో పాటు రైతులకు త్వరితగతిన నీరు వస్తుందన్నారు. 69,72 జిఓలను ఆమలు చేసి ఈ ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
ముఖ్యంగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టుపై ఆయకట్టు రైతులకు ప్రధాన హక్కు అని ఆ హక్కును కాలరాసే ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీతమ్మ పాల్గొన్నారు.