మహబూబ్‌నగర్

కృష్ణా నదిలోని నికర, వరద జలాల...ప్రతి నీటిబొట్టును వినియోగించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 4: కృష్ణానది నీటివాటాలోని నికర, వరదజలాల ప్రతినీటి బొట్టును జిల్లా ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రమిస్తున్నారని ఆ దిశగా ముందుకు వెళ్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలన్ని ఏకమై ప్రాజెక్టులను ఎలా అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు కుక్కిన పెనులా పడుండి జిల్లాకు ఎలాంటి ఉపయోగమైన పనులు చేయకుండా ఆంధ్రనాయకుల మోచేతులకింది నీళ్లు తాగి జిల్లాను సర్వనాశనం చేసిన వారు ఇప్పుడేమో ఎదో ఎలగబెడుతామని గొప్పలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రయోజనాలు ఎమిటో తమకు బాగా తెలుసని అందుకే తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీళ్లు తరలించుకుని పోతుంటే 20 రిజర్వాయర్లను అక్రమంగా నిర్మిస్తే అప్పట్లో నోరు మూసుకుని ఉన్న నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎక్కడిదన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జిల్లాకు వరదప్రదాయిని అని ఒక ప్రాజెక్టు తర్వాత మరోక ప్రాజెక్టు నిర్మించి తీరుతామన్నారు. నికర, వరద జలాల జిల్లాకు రావల్సిన ప్రతినీటిబొట్టును వాడుకుని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరుతామన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని రాజకీయం భూస్థాపితం అవుతుందనే భయంతో మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి తన ఉనికి కోసమే ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కర్వెన నుండి నారాయణపేట ప్రాంతానికి సాగునీరు వెళ్తుందని డిజైన్లలో అంతా ఉందని ఎదో రాజకీయం కోసం తమ పబ్బం గడుపుకోవడానికి తాము కూడా రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకోవడానికి కొత్త డ్రామాలకు తెర లేపుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండే పాలమూరు ఎత్తిపోతలకు నీటిని తీసుకోవడం శ్రేయస్కరం కాబట్టే ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి జిల్లా ప్రజలకు అంకితం ఇచ్చారన్నారు. 123 జిఓపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకోవడం హస్యాస్పదమన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జిల్లాలో ప్రతి ప్రాజెక్టు నిర్మాణం అవుతుందని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం జరుగుతుందని వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నాయకులు కోట్ల కిషోర్‌రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.