మహబూబ్‌నగర్

మల్లన్న సాగర్‌పై రాజకీయం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 4: ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేపట్టిన మల్లన్నసాగర్ విషయంలో రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు తగదని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి హితవు పలికారు. గురువారం షాద్‌నగర్ మార్కెట్ యార్డులో కొత్త మార్కెట్ పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతుంటే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన స్వంతానికి ప్రాజెక్టులను కట్టడం లేదని, యావత్తు తెలంగాణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టులను చేపడుతున్నారని అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నిజామాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, టిడిపి నాయకులు లేని పోని రాద్దాంతం చేస్తున్నారన్నారు. రైతుల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకులు కాస్తా అందుకు విరుద్ధ్దంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అయితే కోర్టు తీర్పు ప్రకారం 2013 భూసేకరణ చట్టం లేదా 123జీఓ ప్రకారమైనా నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రతిష్టాత్మంగా చేపట్టగా బిజెపి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే విధంగా కోర్టులో దావాలు వేసారన్నారు. కోర్టు నాగంకు మొట్టికాయలు పెట్టినా ఆయన తన పద్దతిని మార్చుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సమైక్య రాష్ట్ర పాలనలో ప్రాజెక్టులు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయన్నారు. దీంతో రైతులు వలసలకు వెళ్లారని, ఇపుడేమో రైతుల కష్టాలను గుర్తించిన సిఎం కేసీఆర్ వారి సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, టిఆర్‌ఎస్ నేతలు వీర్లపల్లి శంకర్, నరేందర్, వెంకట్‌రాంరెడ్డి, ఎంఎస్ నటరాజ్, సూర్యప్రకాష్, ఆకుల మల్లేష్, ఎమ్మె సత్తయ్య, శ్రీ్ధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*
ఆంధ్రభూమి బ్యూరో