మహబూబ్‌నగర్

జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 4: ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 317.88 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జూరాల అధికారులు అప్రమత్తమై 13 గేట్లను రెండు మీటర్ల ఎత్తుకు తెరచి ప్రాజెక్టు నుంచి దిగువకు 1,38,401 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆల్మట్టి జలాశయంలో 519.250 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 42,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు 26 గేట్లను తెరచి దిగువకు 1,45,380 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలో 491.250 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 80,340 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తి 1,10,650 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
జూరాల ద్వారా...
జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటితో జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టాన్ని నిల్వ చేశారు. ప్రాజెక్టుపై ఆధారపడిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1500 క్యూసెక్కులు, సమాంతర కాలువకు వెయ్యి క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాలువలకు 600 క్యూసెక్కులు, భీమా ప్రాజెక్టుకు 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.
ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి...
జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు నుంచి 48వేల క్యూసెక్కులను వినియోగించుకొని జూరాల జలవిద్యుత్ కేంద్రం ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడం పట్ల జెన్‌కో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరు యూనిట్ల ద్వారా దాదాపు 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టి వెల్టూర్ సబ్‌స్టేషన్‌కు అనుసందానం చేసినట్లు అధికారులు తెలిపారు.