మహబూబ్‌నగర్

పశువులు వధశాలలకు వెళ్లకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 29: పశువులు వధశాలలకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, తాగునీరు, గ్రాసం కొరత కారణంగా పశువులను వధశాలలకు అమ్ముకుంటున్న వాటిని ఆరికట్టాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో పశువుల పరిరక్షణ, వేసవి తీవ్రత, వడగాల్పులు, తదితర అంశాలపై కలెక్టర్ టికె శ్రీదేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న 232 పరీక్షా కేంద్రాలలోని ఇతర తరగతి విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త చర్యగా పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి తెలిపారు. తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతిరోజు ఉష్ణోగ్రతలను, అలాగే వర్షాపాతం వివరాలను ఉదయమే తనకు సమర్పించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన 164 తాత్కాలిక వాతావరణ కేంద్రాల ద్వారా ఉదయం 7 గంటల వరకు ఆయా కేంద్రాల వారిగా నివేదికలు పంపాలని సిపిఓను ఆదేశించారు. వాతావరణ కేంద్రాలు సబ్‌స్టేషన్లలో ఏర్పాటు చేయగా వాటి పనితీరుపై నివేదిక పంపాలని ఆర్డి ఓను, ట్రాన్స్‌కో ఎస్‌ని ఆదేశించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి వివరాలతో పాటు, పశువుల వివరాలను గ్రామాల వారిగా ప్రతిరోజు తనకు ఉదయమే సమాచారం పంపాలని, ఆదేశించారు. జిల్లా నుండి తాగునీరు, గ్రాసం కొరత కారణంగా పశువులు ఇతర ప్రాంతాలకు, వధ శాలలకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 30న జిల్లాలోని అన్ని గోశాలల వారితో సమావేశం నిర్వహించి పశువులు వధశాలలకు వెళ్లకుండా కాపాడాలని తెలిపారు. లారీలు, ఇతర వాహనాలలో పశువులను ఇతర ప్రాంతాలకు తరలించకుండా తనిఖీలు చేపట్టాలని తనిఖీల్లో పట్టుబడిన పశువులను గోశాలలకు తరలించాలని ఆర్టి ఓ కిష్టయ్యను కలెక్టర్ ఆదేశించారు. గత్యంతరం లేక పశువులను అమ్మేవారు పశువులను అమ్మకుండా గోశాలలకు పంపించాలని కోరారు. పత్రికల్లో ప్రచురితమయ్యే వడదెబ్బ మృతులకు సంబందించి త్రిసభ్య కమిటీ ప్రతి రోజు సాయంత్రం లోపు విచారణ చేసి తక్షణమే తనకు సమాచారం అందించాలన్నారు. లేనియడల సంబందిత మండలాల అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీటి పొదుపుపై ప్రచార ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో నీటిని వృధా చేయకూడదని అలాగే అటవీ ప్రాంతాల్లో జంతువులకు నీటి అందుబాటుకు గాను నీటితొట్టిలపై నివేదిక ఇవ్వాలని డిఎఫ్‌ఓలను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఆర్‌ఓ భాస్కర్, ఆర్డిఓలు హన్మంతురెడ్డి, రామచందర్, దేవేందర్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ జేడి సుధాకర్, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ పద్మనాభం, డిఎంఅండ్‌హెచ్‌ఓ పార్వతి, డిసిహెచ్‌ఎస్ మీనాక్షి, సిపిఓ లలిత్‌కుమార్, ఆర్విఎం పిఓ గొవిందరాజులు, ఆర్టిఓ కిష్టయ్యలు హాజరయ్యారు.