మహబూబ్‌నగర్

వడదెబ్బపై ప్రజల్లో అవగాహన కల్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 29: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వడగాల్పులు, తాగునీటి పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. వడగాల్పుల వల్ల ప్రజలు ముఖ్యంగా కూలీలు, పాఠశాలల విద్యార్థులు, వివిధ పనులపై బయటకు వెళ్లేవారు ఇబ్బందులకు గురికాకుండా తగు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులను తాగునీటి పరిస్థితిని పర్యవేక్షించాలని తెలిపారు. రైతులు తమ పశువులను కబేరాలకు తరలించడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని పశువులకు గ్రాసంతో పాటు, నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఇతర విషయాలకు సంబందించి అవసరమైన నిధులపై నివేదిక పంపాలని కలెక్టర్‌కు సూచించారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు వడదెబ్బలకు గురికాకుండా అవగాహన కార్యక్రమాలపై పెద్ద ఎత్తున చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ టికె శ్రీదేవి సి ఎస్ రాజీవ్ శర్మకు జిల్లా పరిస్థితులపై వివరిస్తూ క్షేత్రస్థాయిలో ఇదివరకే రెండుసార్లు సమావేశం నిర్వహించామని అన్ని పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఓ ఆర్ ఎస్ ప్యాకేట్లు పెట్టామని అలాగే 232 పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఓ ఆర్ ఎస్ ప్యాకేట్లతో పాటు ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 40 నుండి 42 డిగ్రీలు నమోదు అవుతుండగా రాత్రి ఉష్ణోగ్రత 28 నుండి 30 డిగ్రీలుగా నమోదు అవుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పనులు జరిగే 9600 సైట్ల వద్ద కూలీలకు అవసరమయ్యే తాగునీరు, నీడను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. అవసరమైన చోట, అలాగే ప్రజలు రద్ది ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్ జి ఓల సహకారంతో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలను, తాగునీటి వసతిని కల్పిస్తున్నామని తెలిపారు. 416 నీటి వనరుల ద్వారా 275 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నామని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే తాగునీటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని ఫిబ్రవరి నెలలో జిల్లాలో భూగర్భజలాలు 15 మీటర్ల లోతుగా పడిపోగా మార్చిలో 16 మీటర్ల లోతులో పడిపోయాయని తెలిపారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఉన్న బోర్లను ప్లసింగ్ చేయడం మరమ్మత్తులకు ప్రాధాన్యతను ఇస్తున్నామని తప్పని పరిస్థితుల్లోనే తాగునీటిని సరఫరా చేస్తున్నామని ప్రత్యమ్నయం లేని చోట బోర్ల తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. తాగునీటి పరిస్థితిపై గ్రామాలు, హబిటేషన్ల వారిగా విశే్లషణ చేస్తున్నామని తాగునీటిని పొదుపు చేసేందుకు నీటి పొదుపుపై జిల్లాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వడగాల్పులపై 46 అంశాలతో కూడిన సమాచారంపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని జిల్లాలో 12.38లక్షల పశు సంపద ఉందని పశువులను కాపాడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు స్పందించిన సి ఎస్ రాజీవ్ శర్మ ఎక్కడ లేని విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో నీటి పొదుపుపై విస్తృత ప్రచారం చేపట్టడం, చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్‌ను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో జేసి రాంకిషన్, డిఆర్‌ఓ భాస్కర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ పధ్మనాభం, పశుసంవర్థకశాఖ జెడి సుధాకర్, ఆర్డిఓ హన్మంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.