మహబూబ్‌నగర్

విద్యుత్ కోతలు లేని తెలంగాణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 28: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో నిరంతరం విద్యుత్ కోతలు ఉండేవని స్వరాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కోతలు లేని తెలంగాణగా నిర్మాణం చెందిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని జడ్పి కార్యాలయ సమీపంలో గల 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ కోతలు లేని తెలంగాణ నిర్మాణం అయ్యిందని రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్ర రైతాంగానికి కరెంట్ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కెసి ఆర్ ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లి కరెంట్ కష్టాలు లేని తెలంగాణను నిర్మించాలన్నారు. గతంలో కరెంట్ లేని కారణంగా పంటలు ఎండిపోయాయని, రైతులు రోడ్లపైకి వచ్చేవారని కానీ ప్రస్తుతం తమకు కరెంట్ ఉంది. సాగునీరు ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. రైతులు చేస్తున్న డిమాండ్ సాగునీటిపై ఇక ప్రభుత్వం దృష్టి సారించిందని పాలమూరు ఎత్తిపోతల పథకంతో జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. కొత్త జిల్లాలు మూడు ఏర్పడ్డ కరెంట్ కోతలు ఉండవని సాగునీరు అన్ని ప్రాంతాలకు కృష్ణాజలాలు రానున్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అవసరమున్న చోట సబ్‌స్టేషన్ల నిర్మాణం జరిగిందని
మహబూబ్‌నగర్ పట్టణంలో మరో సబ్‌స్టేషన్ అవసరం ఉండడంతో కొత్తగా నిర్మించి ప్రజల సౌకర్యార్థం ప్రారంభించామన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు అయిన వెనుకాడకుండా సబ్ స్టేషన్ల నిర్మాణం కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మహబూబ్‌నగర్ పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడానికే రోడ్ల వెడల్పు కొనసాగుతుందని ముందుగా ప్రభుత్వ కార్యాలయాల పరిధిలలో రోడ్ల వెడల్పు కార్యక్రమం చకచకగా నడుస్తుందన్నారు. ప్రజలు కూడా పట్టణంలో ట్రాఫీక్ రద్దిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారుగా అధికారులు సూచించిన మేరకు రోడ్డుకు వదులుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.