మహబూబ్‌నగర్

చకచకా జిల్లాల ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించి అందుకు సంబందించిన ముసాయిదాలను విడుదల చేయడమే కాకుండా జిల్లాల రూపురేఖలకు సంబందించిన నియోజకవర్గాలు, మండల కేంద్రాలతో కూడిన పటాలను కూడా విడుదల చేసింది. దిని ఆధారంగా ఇక జిల్లాల ప్రక్రియ చకచకగా సాగుతుందని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి సంకేతాలు ఇచ్చింది. అయితే ముందుగా మూడు జిల్లాలుగా రూపాంతరం చెందుతున్న మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ముందుగా పోలీసుశాఖ తమ కార్యాలయాలపై దృష్టి సారించింది. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు డివిజన్ కేంద్రాల్లో డిఎస్పీ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. పోలీసుశాఖ తమ కార్యక్రమాలను ముందడుగు వేసినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు నివేదికలు కూడా అందజేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పడనున్న ఆమరచింత, నందినె్న, రాజాపూర్, పదరా మండలాలకు పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాట్లపై కూడా నివేదిక అందించినట్లు సమాచారం. అదేవిధంగా దన్వాడ మండలం గతంలో ఉన్నప్పటికిని ఈ పరిధిలో మరికల్ పోలీస్‌స్టేషన్ ఉండేది. అయితే మరికల్ కొత్త మండలంగా రూపాంతరం చెందుతుండడంతో దన్వాడకు కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటుపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు రాష్ట్ర పోలీసుశాఖకు నివేదికలు కూడా అందినట్లు పోలీసు వర్గాల సమాచారం. ఇది ఇలా ఉండగా కొత్త మండలాలుగా రూపాంతరం చెందుతున్న వాటిలో రెవెన్యూశాఖ సేవలను కూడా ఎలా విస్తరింపజేయాలనే వాటిపై రాష్ట్ర రెవెన్యూశాఖ దృష్టి పెట్టింది. కొత్త మండలాల కార్యాలయాల ఏర్పాట్లపై అధికారులు నివేదికలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో...
మహబూబ్‌నగర్, కొడంగల్, జడ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాలు ఉంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో దౌల్తాబాద్, బొంరాస్‌పేట, కోస్గి, కొడంగల్, దామరగిద్ద, మద్దూర్, ఊట్కూర్, దన్వాడ, నారాయణపేట, మరికల్ (కొత్త), మక్తల్, మాగనూర్, నర్వ, అడ్డాకుల, భూత్పుర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ అర్బన్ (కొత్త), మహబూబ్‌నగర్ రూరల్ (కొత్త), మిడ్జిల్, జడ్చర్ల, కోయిలకొండ, నవాబుపేట, హన్వాడ, బాలానగర్, రాజాపూర్ (కొత్త) 25 మండలాలతో కూడిన మహబూబ్‌నగర్ జిల్లా ఉంటుంది.
నాగర్‌కర్నూల్ జిల్లా
నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలు ఉంటున్నాయి. అయితే కొల్లాపూర్‌లోని వీపనగండ్ల మండలం మినహాయించి వనపర్తి జిల్లాలో కలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, వంగూర్, కల్వకుర్తి, వెల్దండ, తాడూర్, తిమ్మాజిపేట, బిజినేపల్లి, ఉప్పునుంతల, నాగర్‌కర్నూల్, లింగాల, బల్మూర్, తెల్కపల్లి, కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పదర(కొత్త), అచ్చంపేట, అమ్రాబాద్ మండలాలకు జిల్లా రూపాంతరం చెందుతుంది. 20 మండలాలతో కూడిన జిల్లాగా ఏర్పడేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వనపర్తి జిల్లా ఇలా..
వనపర్తిజిల్లాలో వనపర్తి, అలంపూర్, గద్వాల నియోజకవర్గాలతో పాటు దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని కొత్తకోట, సిసికుంట, మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూర్, ఆమరచింత (కొత్త), కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వీపనగండ్ల సైతం కలిశాయి. వనపర్తి జిల్లాలో వనపర్తి, పెద్దమందడి, గోపాల్‌పేట, పెబ్బేర్, పాన్‌గల్, ఖిల్లాఘన్‌పూర్, ఆత్మకూర్, వీపనగండ్ల, కొత్తకోట, ఆమరచింత (కొత్త), అలంపూర్, మల్దకల్, గద్వాల, వడ్డెపల్లి, మానవపాడు, ఇటిక్యాల, అయిజ, గట్టు, నందినె్న (కొత్త), ధరూర్, చిన్నచింతకుంట 21 మండలాలతో కూడిన జిల్లా రూపాంతరం చెందబోతుంది. దినిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆయా జిల్లాల పరిధిలో ముఖ్యమైన కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తులు ప్రారంభించాయి.