మహబూబ్‌నగర్

ఐక్య పోరాటంతో రెవెన్యూ డివిజన్ సాధించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, ఆగస్టు 30: ఐక్య పోరాటంతోనే కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ సాధించుకుందామని, కల్వకుర్తి ప్రజల మనోభావాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మాట్లాడుతూ ఐక్య పోరాటంతోనే రెవెన్యూ డివిజన్ సాధించుకుందామని, రెవెన్యూ డివిజన్ డిమాండ్ కల్వకుర్తి ప్రజల న్యాయమైనందని, రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి ప్రజల ఆకాంక్షను గుర్తించాలని, కల్వకుర్తి ప్రాంతానికి గత కొంత కాలంగా అన్యాయమే జరుగుతుందని నూతన రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటులో కల్వకుర్తి ప్రాంతం రెవెన్యూ డివిజన్ అవుతుందని ప్రజలు ఎంతో అశతో ఉన్నారని, ప్రజల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కల్వకుర్తి ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కల్వకుర్తి నగర పంచాయతీ చైర్మన్ శ్రీశైలం నేతృత్వంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక సమావేశంలో కల్వకుర్తి ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి వైస్ చైర్మన్ షాహెద్, కౌన్సిలర్లు శ్రావణి, సౌజన్య, పార్వతీ, షాకీర్, జానకమ్మలతో పాటు నగర పంచాయతీ కౌన్సిలర్లు జెఎసి శిబిరంలోని అఖిల పక్ష నేతలకు తీర్మానం అందించడంతో పాటు కలెక్టర్, సిఎం కెసిఆర్‌కు తీర్మానం పంపడం జరుగుతుందని చైర్మన్ శ్రీశైలం పేర్కొన్నారు. దీక్షలో కాంగ్రెస్, బిజెపి, టిడిపి, అడ్వకేట్ జెఎసి, రైతు, విద్యార్థి సంఘాల నాయకులు గంగాధర్, శ్రీరాములు, గోపి, జగన్, దుర్గప్రసాద్, కృష్ణగౌడ్, రాఘవేందర్‌గౌడ్, లక్ష్మినారాయణ, సదానందంగౌడ్, పరుషరాములు, విష్ణు, రాజేందర్, గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.