మహబూబ్‌నగర్

రాయలంపాడు నిర్వాసితులకు వారంలోగా నష్టపరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మహబూబ్‌నగర్ జిల్లా రాయలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఉన్న గట్టు మండలం ఆలూరు గ్రామంలో ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే నిర్వాసితులకు పూర్తిగా నష్టపరిహారం, పునరావాస బెనిఫిట్లను కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. హరిజన్ నాగేష్, సురేష్ కుమార్‌తో పాటు ఆలూరుకు చెందిన 223 మంది గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ విచారించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ రామకృష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు. పిటిషనర్ల అకౌంట్లలో నిర్దేశించిన నష్టపరిహారాన్ని డిపాజిట్ చేయాలని, నిర్వాసితులకు అవసరమైన బెనిఫిట్లను వారం రోజుల్లోగా కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. 2005 ఏప్రిల్ 8వ తేదీన జారీ చేసిన జీవో 68లో నిర్దేశించినట్లుగా పునరావాస సదుపాయాలు, నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించలేదని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.