మహబూబ్‌నగర్

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, సెప్టెంబర్ 22: క్రీడలతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని, మానసిక ఉల్లాసానికి, శారీరక దృడత్వానికి ఎంతో దోహదపడుతాయని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతిగృహం వద్ద మండల క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలని, నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హత గల ఉపాధ్యాయులు ఉంటారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని 300 గురుకుల పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని, జిల్లాలోని ఎనిమిది గురుకుల పాఠశాలల మాత్రమే ఉండేవని, ప్రస్తుతం జిల్లాలోని 103 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో 119 బిసి గురుకుల పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని, విద్యపై ప్రత్యేకదృష్టి సారించారన్నారు. గద్వాల నియోజకవర్గానికి మైనార్టీ, ఎస్సీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. సింధూను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లో ముందుండి తమ సత్తాను చాటాలన్నారు. గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆట స్థలం ప్రారంభించడం ఎంతో శుభ సంతోషమని, రాఘవేంద్రస్వామి మఠం స్థలంలో క్రీడాప్రాంగణం ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు ఎకరాలలో విద్యార్థులకు అనువైన స్థలంలో ఆటలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన దాతలు ముందుకొచ్చి తాత్కాలికంగా క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. డిఎస్‌పి బాలకోటి, సిఐ సురేష్‌లు మాట్లాడుతూ క్రీడా ప్రాంగణానికి సహకరించిన పెద్దపల్లి అజయ్, పిడి జితేంధర్‌ను వారు అభినందించారు. దంతవైద్యుడు డాక్టర్ మహేష్ కస్తూర్భా పాఠశాలకు ఐదు ఫ్యాన్లను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సవారమ్మ, వైస్ ఎంపిపి రాజారెడ్డి, జడ్పీటిసి భాస్కర్, సర్పంచ్ దామనాగరాజు, ఎంపిటిసి వెంకటన్న, టిఆర్‌ఎస్ నేతలు మధుసూధన్‌రెడ్డి, ప్రహ్లాద్‌రావు, తిమ్మారెడ్డి, ధర్మారెడ్డి, వెంకటన్న, విష్ణువర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, హెచ్‌ఎం స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. వీరజవాన్లకు రెండు నిమిషాలు వౌనం పాటించారు.