మహబూబ్‌నగర్

డివిజన్ సాధించే వరకు ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, సెప్టెంబర్ 22: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అచారి, టిడిపి తాలుకా అధ్యక్షుడు బాలస్వామిగౌడ్ లు అన్నారు.పట్టణంలోని తహాశీల్దార్ కార్యాలయం ముందు గత 27 రోజులుగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కేంద్రంతో పాటు కడ్తాల, చారకొండలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు, ఆమరణ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రిలే దీక్షలలో భాగంగా గురువారం జెఎసి శిబిరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో అఖిలపక్షం నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ రూప్లానాయక్, మాజీ ఎంపిపి మాధవయ్య, మాజీ జడ్పీటిసి హరిదాసు, టిఆర్‌ఎస్ నాయకులు భూపతిరెడ్డి,టిడిపి నాయకులు జంగయ్య, బాలస్వామిగౌడ్‌లు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే వరకు వివిధ రకాలుగా ఉద్యమం కొనసాగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కల్వకుర్తి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరారు. అదేవిధంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అచారి మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకు కల్వకుర్తి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, రానున్న రోజుల్లో ఉద్యమం ఉదృత్తం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుర్తి ప్రజల అకాంక్షను గుర్తించాలని,రాష్ట్ర ఉప ప్రణాళిక ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిని కలవడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించారని సి ఎం దృష్టికి తీసుకెళ్లి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కు తనవంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ధీక్ష శిబిరంలో యడ్మ సత్యం, రాములు, లక్ష్మణశర్మ, శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్, జంగయ్య, ఆనంద్‌కుమార్, రాఘవేందర్‌గౌడ్, బంగారయ్య, విష్ణు, రాములు, మహిళలు తదితరులు ఉన్నారు.